విజ‌య్‌కు మెగా స‌పోర్ట్‌

ఫేక్ న్యూస్ రాస్తున్న కొన్ని వెబ్‌సైట్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వెబ్‌సైట్ వ్య‌వ‌హార శైలిపై ద‌య్య‌ప‌ట్టారు. మహేశ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి, అనీల్ సుంకర తదితరులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ నిలిచారు. అయితే ఈ వ్యవహారంపై మెగా ఫ్యామిలీ హీరోలు సైలెంట్‌గా ఉన్నారేంటి? అని అంద‌రూ అనుకున్నారు. అయితే ఉద‌యానికంతా మెగాస్టార్ చిరంజీవి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ట్విట్ట‌ర్ ద్వారా త‌న సపోర్ట్‌ను అందించారు. ‘‘డియర్ విజయ్ నీ ఆవేద‌న‌ను నేను అర్థం చేసుకోగ‌ల‌ను. బాధ్య‌త లేని రాత‌ల కార‌ణంగా నేనూ,నా కుటుంబం బాధ‌ప‌డిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి’’ అంటూనే అభిప్రాయాల‌ను వార్త‌లుగా మ‌ల‌చ‌వ‌ద్ద‌ని జ‌ర‌లిస్టుల‌కు హిత‌వు ప‌లికారు.

నిర్మాత‌ల గిల్డ్ కూడా విజ‌య్‌కు స‌పోర్ట్ నిలిచింది. అదే స‌మయంలో మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున సైతం విజ‌య్‌కు స‌పోర్ట్‌ను అందించారు. కొలీగ్ విజ‌య్‌కు అండ‌గా నిల‌బ‌డిన చిరంజీవి ధ‌న్య‌వాదాలు చెబుతూనే ఇత‌ర హీరోలైన మ‌హేశ్‌, ర‌వితేజ స‌హా అంద‌రికీ నాగ్ ధ‌న్య‌వాదాలు చెప్పారు. ఈ వ్య‌వ‌హారం మ‌నం అందరం ఆలోచించాల‌ని, అంతే కాకుండా నైతికంగా స‌పోర్ట్ చేయ‌డ‌మే కాకుండా స‌రైన యాక్ష‌న్ ప్లాన్ కూడా సిద్ధం చేయాల‌ని నాగార్జున కోరారు. ఈ వ్య‌వ‌హారంపై త‌ర్వ‌లోనే హీరోలంద‌రూ ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

నిర్మాత‌గా మారుతున్న అక్కినేని హీరో!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్

శ్రీముఖికి అనుకోని షాక్‌...పోలీస్ కేసు

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. న‌ల్ల‌కుంట్ల‌కు చెందిన వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ అనే వ్య‌క్తి శ్రీముఖిపై ఫిర్యాదు చేశారు. ఇంత‌కు ఆమెపై ఫిర్యాదు ఎందుకు చేశారు?

కేజ్రీవాల్.. వైఎస్ జగన్ నోట ఒకే మాట..!

‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్‌ ఇదీ..!

బాలీవుడ్ ద‌ర్శక నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో..

సాధినేని యామినికి అమెరికాలో అరుదైన గౌరవం

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల