న్యూలుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన చిరు..

లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఒకసారి చేపలకూర చేసి మెప్పిస్తే.. మరోసారి దోశలు వేస్తూ.. ఇంకోసారి తన భార్యతో కలిసి గతంలో తీసుకున్న పిక్ మాదిరి పిక్‌నే తీసుకుని.. అలాగే తన మనవరాలితో సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మెప్పించారు. ఇలాంటివి ఎన్నో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం దగ్గరగా ఉంటున్న వస్తున్న చిరు.. తాజాగా పోస్ట్ చేసిన పిక్ మాత్రం బాగా ఆకట్టుకుంటోంది.

ఇటీవల క్లీన్ షేవ్‌లో కనిపించి అందరినీ చిరు ఆశ్చర్యపరిచారు. అయితే గతంలో కూడా ఆయనను అభిమానులు అలా చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్‌గా చిరు పోస్ట్ చేసిన పిక్ మాత్రం అభిమానులు మునుపెన్నడూ చూడలేదు. అలాంటి పిక్‌ను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి షాకిచ్చారు. ఇంతకీ ఆ లుక్ ఏమిటో పిక్‌లో చూసి మీరు తెలుసుకునే ఉంటారు. ఈ పిక్ చూసిన అభిమానులు షాకవుతున్నారు. అసలాయన చిరుయేనా అన్నట్టుగా ఉంది పిక్. అయితే ఈ న్యూ స్టైల్‌ని మెగాస్టార్ ఎందుకు ట్రై చేశారన్నది మాత్రం తెలియరాలేదు. ఏదైనా క్యారెక్టర్ ట్రయలా? లేదంటే మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.

More News

ఏపీలో కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన 'సీరో' సర్వే..

కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.. ఇప్పటికే ఐదు లక్షలకు పై చిలుకు కేసులు ఏపీలో నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చూపుతున్న బోగస్ లెక్కలు కూడా ఏపీలో చూపించట్లేదు.

బిగ్‌బాస్4: సస్పెన్స్‌లో పెట్టాల్సింది ఎవరిని? ఏంటీ కట్టప్ప గోల?

బిగ్‌బాస్ క్యాజువల్‌గానే ఇవాళ కూడా బోర్ కొట్టించింది. నిజానికి.. గత మూడు రోజులతో పోలిస్తే ఇవాళ మరింత బోర్ కొట్టించింది. దివి కంటెస్టెంట్లు అందరి గురించి తను వ్యూని వివరించడంతో షో స్టార్ట్ అయింది.

నటి శ్రావణి కేసు: దేవరాజు ఒక ప్లేబాయ్‌గా గుర్తించిన పోలీసులు

బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసు డైలీ సీరియల్‌ను మించిన మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గంటకో కొత్త పేరు వెలుగు చూస్తోంది.

అక్టోబర్ 2న 'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ప్రీమియర్

వెబ్ సిరీస్ ప్రారంభం నుండి శుభం కార్డు పడేవరకూ అనుక్షణం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురిచేసే బెస్ట్ థ్రిల్లర్‌లను 'జీ 5' ఓటీటీ ప్రేక్షకులకు అందించింది.

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత పేరు..

టీవీ సీరియల్ నటి శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది.