మెగాస్టార్ ఠాగూర్ కి 14 ఏళ్లు

  • IndiaGlitz, [Sunday,September 24 2017]

ఇంద్ర వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన చిత్రం ఠాగూర్‌. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం లంచం పై పోరాటం చేసిన ఓ సామాన్యుడి క‌థ‌గా తెర‌కెక్కింది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ర‌మ‌ణ (మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు) ఆధారంగా తెలుగులో నిర్మిత‌మైంది.

చిరంజీవి న‌ట‌న‌.. శ్రియ, జ్యోతిక గ్లామ‌ర్‌.. మ‌ణిశ‌ర్మ సంగీతం.. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌.. ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ఇందులోని నేను సైతం గీతానికి గానూ ఉత్త‌మ గీత‌ ర‌చ‌యితగా సుద్దాల అశోక్ తేజకి నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది. 253 కేంద్రాల్లో 50 రోజులు, 191 కేంద్రాల్లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైందీ చిత్రం. 2003లో సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఠాగూర్‌.. నేటితో 14 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

పూరి తనయుడి కోసం కొత్త హీరోయిన్...

హీరోల ను మాస్ యాంగిల్ లో ప్రెజంట్ చేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు.

మహేష్ బాబు బాటలో త్రిష..

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన అతడు,సైనికుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన చెన్నై సుందరి త్రిష..

'అమ్మాయిలంతే..అదో టైపు' పస్ట్ లుక్ విడుదల

మన సంస్కృతికి మారు పేరుగా నిలిచిన స్త్రీలోని ఎమోషనల్ యాంగిల్ ను మా 'అమ్మాయిలంతే ..అదోటైపు'

త్రీడీ టెక్నాల‌జీలో రోబో సీక్వెల్ '2.0'

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రాన్ని ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి

వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న అంజలి సోదరి.. ఆరాధ్య!

కథానాయికల చెల్లాయిలు..వెండి తెరపై అడుగుపెట్టడం,తమ సత్తా చాటుకోవడం చూస్తూనే ఉన్నాం.