నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో చిరు

  • IndiaGlitz, [Monday,June 18 2018]

కెరీర్ ఆరంభంలో ప‌లు నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేసి న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. పూర్తిస్థాయిలో క‌థానాయ‌కుడి పాత్ర‌లు చేయ‌డం మొద‌లుపెట్టాక‌.. ఆ త‌ర‌హా పాత్ర‌లు మ‌ళ్ళీ చేయ‌నేలేదు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అదేమిటంటే.. సైరా న‌ర‌సింహా రెడ్డి త‌రువాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరు రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి రైతు పాత్ర కాగా.. మ‌రొక‌టి బిల‌య‌నీర్ పాత్ర‌గా వినిపిస్తోంది.

అంతేగాకుండా.. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ పోషించిన మేయ‌ర్ త‌ర‌హా పాత్ర‌లో అవుట్ అండ్ అవుట్ నెగెటివ్ పాత్ర‌గా బిల‌య‌నీర్ పాత్ర ఉంటుంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే గ‌నుక నిజ‌మైతే.. చాలా కాలం త‌రువాత చిరుని స‌రికొత్త పాత్ర‌లో చూసే అవ‌కాశం అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు ద‌క్కిన‌ట్టే. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది

More News

మ‌హేష్ 25.. షూటింగ్‌లో ఎవ‌రుంటారంటే..

భ‌ర‌త్ అనే నేనుతో భారీ విజ‌యాన్ని అందుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రానికి సిద్ధ‌మ‌య్యారు.

'య‌న్‌.టి.ఆర్' విడుద‌ల తేదికి ఓ సెంటిమెంట్‌

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా 'య‌న్‌.టి. ఆర్' పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

'స‌వ్య‌సాచి' రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తుస‌.. 'అల్ల‌రి అల్లుడు' (1993) చిత్రం కోసం నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. 'నువ్వే నువ్వే'తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు.

ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌.