ఆగ‌స్టు 25 న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

  • IndiaGlitz, [Friday,August 23 2019]

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ నెల 25(ఆదివారం)న ఉద‌యం 10.15 నిమిషాల‌కు ఎస్వీఆర్ అభిమానుల స‌మ‌క్షంలో ప‌ద్మ‌భూష‌ణుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం మెగాస్టార్ ప్రత్యేక విమానం లో బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుండి రోడ్ మార్గాన్న తాడేపల్లిగూడెం గం 10.15 ని. కు చేరుకుంటారు

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 3 జూలై 1918 లో జ‌న్మించారు. 18 జూలై 1974లో ప‌ర‌మ‌ప‌దించారు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో న‌టించారు. షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయ‌న‌ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు.

కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు. సాంఘీకంలోనూ అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ ఈయన బిరుదులు

More News

రాజధాని అమరావతిపై బొత్సా తాజా ప్రకటన ఇదీ...

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం విదితమే.

జగన్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఇప్పటికే వైఎస్ జగన్‌ సర్కార్‌కు ఏపీ హైకోర్టు జలక్ ఇచ్చిన విషయం విదితమే.

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్‌లు ఇస్తున్నారంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు.

ముంపుకు గురైన లంక గ్రామాలను సర్కార్ ఆదుకోవాలి!

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు,

విజయసాయి.. రుజువు చేస్తే సర్కార్‌కే రాసిస్తా!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సీజన్ అయిపోయింది.. ప్రభుత్వం కూడా ఏర్పాటైందనుకుంటే.. అస్సలు ఎన్నికల సీజన్ ముందున్న కాక ఏ మాత్రం తగ్గలేదు.