close
Choose your channels

తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

Thursday, April 23, 2020 • తెలుగు Comments

తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్ ఛాలెంజ్‌ల‌ను విసురుకుంటున్నారు. సందీప్ వంగా స్టార్ట్ చేసిన బీ ద రియ‌ల్‌మేన్ ఛాలెంజ్ బాగా వైర‌ల్ అవుతుంది. సందీప్ వంగా, రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, కొర‌టాల శివ‌, సుకుమార్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. తార‌క్ ఛాలెంజ్ విసిరినవాళ్ల‌లో చిరంజీవి, వెంక‌టేశ్ ఈరోజు ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి విష‌యానికి వ‌స్తే ఈరోజు ఉద‌యం ఆయ‌న హాలును శుభ్రం చేయ‌డ‌మే కాకుండా త‌ల్లి అంజనాదేవీకి ఉప్మా, పెస‌ర‌ట్టు తయారు చేసిచ్చారు. ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘నేను రోజూ చేసే పనులే ఈవాళ మీకోసం’’ అంటూ మెసేజ్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంను నామినేట్ చేశారు. చిరంజీవి వీడియో పోస్ట్ కోసం తాను వేచి చూస్తున్నాన‌ని చెప్పిన విక్ట‌రీ వెంకేట‌శ్.. చిరంజీవి వీడియో పోస్ట్ చేసిన అనంత‌రం వీడియో పోస్ట్ చేశారు. ‘‘ఇంటి పనుల్లో మన మహిళలకు సాయం చేయండి. బీ ద రియల్ మేన్’’ అని మెసేజ్‌తో పాటు చిన్నోడు మ‌హేశ్‌, కోబ్రా వ‌రుణ్ తేజ్‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని వెంక‌టేశ్ నామినేట్ చేశారు.


Get Breaking News Alerts From IndiaGlitz