ఉప రాష్ట్ర‌ప‌తితో సైరా చూస్తున్న చిరు

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైన సైరా మిగిలిన భాష‌ల‌కంటే తెలుగులో మంచి టాక్‌, మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇంకా విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుంది. చ‌రిత్రలో క‌నుమ‌రుగైన స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రం కావ‌డంతో పాటు.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో, ఆయ‌న ప్ర‌మోష‌న్స్‌లో చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు సైరా సినిమాను చూసి స్పంద‌న‌ను తెలియ‌జేయాలంటూ రాజ‌కీయ నాయ‌కుల‌ను క‌లుస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిశారు.

ఇప్పుడు చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. బుధ‌వారం ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్యనాయుడుని క‌లిసి మాట్లాడారు. ఆయ‌న‌తో క‌లిసి చిరు సైరా సినిమాను చూడ‌బోతున్నారు. ఈ సినిమా వీక్ష‌ణం త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాను క‌ల‌వ‌బోతున్నారు. సినిమా సంగ‌తేమో కానీ.. చిరంజీవి ఇలా రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, కిచ్చాసుదీప్‌, విజ‌య్‌సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో సినిమా తెర‌కెక్కింది. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. ప్యాన్ ఇండియా చిత్రంగా భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్స్‌ను గ‌ట్టిగానే రాబ‌ట్టుకుంది.

More News

బెంగాల్‌లో దీదీ వర్సెస్ దాదా.. నెగ్గేదెవరో!?

దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?

రీమేక్‌లో నటించ‌డానికి నాగ్ ఓకే చెబుతాడా?

కింగ్ నాగార్జున ఈ ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

మ్యాజిక్‌ను మ‌ళ్లీ క్రియేట్ చేస్తారా?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొన్ని కాంబినేష‌న్స్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్ 2012లో జ‌రిగింది.

కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమిదేనా!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్!

ఇదేంటి.. కొంపదీసి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలొగ్గి వారి డిమాండ్లను నెరవేరుస్తున్నారా ఏంటి..?