ఇకపై చిరు సినిమాలన్నీ కుర్ర దర్శకులతోనే!?

రాజకీయాలకు రాం రాం చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు తీయడానికి సీనియర్, కుర్ర దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తన సినీ కెరీర్‌లో చాలా మంది కొత్త, యువ దర్శకులకు అవకాశమిచ్చిన మెగాస్టార్ త్వరలోనే మరో ముగ్గురు దర్శకులతో సినిమాలు చేయనున్నారు. తాజాగా.. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఫోన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను స్వయంగా మెగాస్టారే చెప్పారు. ‘ఆచార్య’ తాను నటించబోయే సినిమాలు యువ దర్శకులతోనే అని చెప్పడంతో మెగాభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఇంతకీ చిరు ఏమన్నారు..!?

‘‘సాహో’ దర్శకుడు సుజిత్‌తో ‘లూసిఫర్’ చేసే ఆలోచన వుంది. బాబీ, మెహర్ రమేశ్‌లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నాను. హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ్‌లను కూడా ఇటీవలే మా ఇంట్లో కలిశాను.. మా మధ్య చర్చలు కూడా జరిగాయి. కొరటాల చిత్రం పూర్తయిన తర్వాత నా కొత్త ప్రాజెక్టు గురించి చెబుతాను. యువ దర్శకులతో పని చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్‌కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది. నాకు కూడా వాళ్లతో, వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది’ అని చిరు తన మనసులోని మాటలను బయటపెట్టేశారు.

మొత్తానికి చూస్తే కుర్ర దర్శకులను ఆదరించడానికి చిరు సిద్ధమయ్యారన్న మాట. యంగ్ డైరెక్టర్ ఇక లేటెందుకు మీ మీ బుర్రకు పనిపెట్టి కథలు రాసుకుని చిరు దగ్గరికెళ్లిపోండి.. అవకాశం ఇచ్చేస్తారంతే..!

More News

గుంటూరులో యువకుడి చావుకు కారణమేంటి.. !?

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా కాటేస్తున్న తరుణంలో ఘోరం జరిగిపోయింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని మొహమ్మద్ గౌస్ అనే యువకుడ్ని పోలీసులు కొట్టారని..

షాకింగ్: ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు.. ప్రభుత్వాలకు వారథిలా.. మరీ ముఖ్యంగా ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుండే పాత్రికేయులను కూడా ఈ వైరస్ వదలట్లేదు.

ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇబ్బందేనా..!

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా స్తంభించింది. ప‌లు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి త‌ప్పించుకోవ‌డానికి లాక్‌డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి.

'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు.

చంద్రబాబుకు చిరు బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు.