మెగాస్టార్ చిరంజీవి ప్రశంశలు అందుకున్న' కొబ్బరిమట్ట' టీజర్

  • IndiaGlitz, [Sunday,May 29 2016]

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా న‌టించిన కొబ్బ‌రిమట్ట 3 నిమిషాల టీజ‌ర్ ని ఇటీవ‌లే మెగా మెన‌ల్లుడు సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. విడుద‌ల‌య్యిన మ‌రుక్ష‌ణం నుండే వ్యూవ్స్ లో రికార్డు క్రియోట్ చేస్తుంది. ఇప్పటికే 10 ల‌క్ష‌ల వ్యూవ్స్ దాటి మ‌రో మైల్ స్టోన్ అందుకుంటానికి దూసుకుపోతుంది. ఇదిలా వుండ‌గా ఈ టీజ‌ర్ కి మెగాస్టార్ ఆశిస్సులు ప్ర‌శంశ‌లు ల‌భించాయి. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందించిన స్టీవెన్ శంక‌ర్ మెగా అభిమానిగా సుప‌రిచితుడు కావ‌టం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి గారికి హీరో సంపూర్ణేష్ బాబు త‌న చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ చూపించ‌టం జ‌రిగింది. ఆ టీజ‌ర్ ని చూసిన చిరంజీవిగారు చాలా బాగుందని, కామెడిగా వుంటూ మంచి మెసెజ్ వుంద‌ని , డైలాగ్స్ రాసిన స్టీవెన్ శంక‌ర్ చాలా డెప్ట్ తో ఈ డైలాగ్స్ రాసాడ‌ని. సంపూ మాడ్యులేష‌న్ చాలా మెచ్యురిటిగా వుంద‌ని ప్ర‌శంశించారు. అంతేకాదు టీజ‌ర్ చూస్తున్నంత‌సేపు న‌వ్వుతూనే వుండ‌టం విశేషం. ఈ చిత్రానికి త‌న బెస్ట్ విషెస్ కూడా అందించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత సాయి రాజేష్ మాట్టాడుతూ.. ఈ రోజు త‌ప్ప‌కుండా మా కొబ్బ‌రిమ‌ట్ట యూనిట్ అంతా పండ‌గ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగాను. ఆయ‌న్ని చూసి చిత్ర రంగం లోకి అడుగుపెట్టాను. ఆయ‌న‌కి వీరాభిమానిని నేను. కేవ‌లం నేనొక్క‌డినే కాదు నా కొబ్బ‌రిమ‌ట్ట చిత్ర యూనిట్ అంద‌రం అన్న‌య్య వీరాభిమానుల‌మే. మా కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ ని సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్ తేజ్ చేతుల మీదుగా విడుద‌ల కావ‌టం విశేషం అయితే ఈరోజు ఇలా మెగాస్టార్ ప్ర‌శంశ‌లు అందుకోవ‌టం మా జ‌న్మ ద‌న్య‌మైంద‌ని అనుకుంటున్నాం. మా చిత్రం విజ‌యం సాధించాల‌ని మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన మెగాస్టార్ చిరంజీవి గారికి మా యూనిట్ త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను. అని అన్నారు

More News

హాలీవుడ్ యానిమేషన్ కు డబ్బింగ్ చెబుతున్న హీరో...

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్,విలన్ గా మారిని జగపతిబాబు ఇప్పుడు నటుడిగా బిజీగా కొనసాగుతున్నారు.

'ఒక్క అమ్మాయి తప్ప' ట్రైలర్ ను మెచ్చుకున్న మహేష్ బాబు

ప్రస్థానం'వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన సందీప్ కిషన్ హీరో గా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'.

బాలయ్యకు గాయమైంది....

నందమూరి బాలకృష్ణ,ప్రస్తుతం తన వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

అనుష్క, చిరు సినిమా చేయడం లేదా....?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో అగ్రస్థానంలో ఉన్న అనుష్క వరుస అవకాశాలతో తీరిక లేకుండా ఉంది.

ప్రియమణి..నిశ్చితార్థం జరిగింది...

హిందీతో పాటు దక్షిణాదిని అన్నీ భాషల్లో నటించడమే కాకుండా తమిళ చిత్రంతో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హీరోయిన్ ప్రియమణి ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కనుంది.