ఇంటర్వెల్ ఫైట్ (కాయిన్ ఫైట్) పూర్తి చేసిన చిరు...

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150వ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంది. ప్ర‌స్తుతం సినిమాలో ఇంట‌ర్వెల్ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. హైద‌రాబాద్ నాన‌క్‌రామ్ గూడ‌లోని రామానాయుడు స్టూడియోలో చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. యాభై మంది జానియ‌ర్ ఆర్టిస్టుల‌తో హీరో చేసే కాయిన్ ఫైట్ ఇది. చాలా థ్రిల్లింగ్‌గా సాగే ఈ ఫైట్ ఓల్డేజ్ హోంలో నేప‌థ్యంలో జ‌రుగుతుంది. రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డ‌మే ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్‌. చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌రణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సినిమాను వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

ధృవ అంత లేటుగా వస్తుందా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ.ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

మ‌రో ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఈ మెంట‌ల్ - బ‌షీద్

శ్రీకాంత్, అక్ష  నాయ‌కానాయిక‌లుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ సినిమాని ఎస్‌.కె.బ‌షీద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.కె.క‌రీమున్నీసా నిర్మిస్తున్నారు. ఈనెల 9న దాదాపు 300 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది.

రవితేజ తో నల్లమలుపు బుజ్జి సినిమా

'లక్ష్మీ','లక్ష్యం','రేసు గుర్రం'వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి)

చైతన్య అక్కినేని ప్రేమమ్ లోని బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ ఈ నెల 8 న విడుదల

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై పి.డి.వి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చేయ‌డం రిస్క్ అందుకే వాళ్లు ముందుకు రాలేదేమో - డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్

అష్టా చ‌మ్మా సినిమాతో న‌టుడుగా ప‌రిచ‌య‌మై....ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ఏక్ట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ అవ‌స‌రాల శ్రీనివాస్. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం జ్యోఅచ్యుతానంద‌.