మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సంద‌ర్భంగా తాను సోషల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుతున్నాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. తొలి ట్వీట్‌తో ఆయ‌నేం చెబుతారోన‌ని అంద‌రిలో ఆస‌క్తి క‌లిగింది. అన్న‌ట్లుగానే ఉగాది రోజున ఉద‌యం 11గంట‌ల 11 నిమిషాల‌కు చిరంజీవి తొలి ట్వీట్ చేశారు.

‘‘అంద‌రికీ శార్వ‌రి నామ ఉగాది శుభాకాంక్ష‌లు. నా తోటి భార‌తీయులంద‌రితో, తెలుగు ప్ర‌జ‌ల‌తో, నాకు అత్యంత ప్రియ‌మైన అభిమానులంద‌రితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడ‌గ‌ల‌గ‌టం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవ‌త్స‌రాది రోజు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న కోరోనా మ‌హ‌మ్మారిని క‌లిసి క‌ట్టుఆ జ‌యించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుందాం. ఇంటి ప‌ట్టునే ఉందాం. సుర‌క్షితంగా ఉందాం.

21 రోజులు మ‌నంద‌రినీ ఇళ్ల‌ల్లోనే ఉండ‌మ‌ని భార‌త ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశం క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనడానికి ఓ అనివార్య‌మైన చ‌ర్య‌. ఈ క్లిష్ట స‌మ‌యంలో మ‌నం, మ‌న కుటుంబాలు, మ‌న దేశం సుర‌క్షితంగా ఉండ‌టానికి మ‌న ప్రియ ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీగారు, మ‌న ప్రియ ముఖ్య‌మంత్రులు శ్రీకేసీఆర్‌గారు, శ్రీ జ‌గ‌న్‌గారు ఇచ్చే ఆదేశాల‌ను పాటిద్దాం. ఇంటి ప‌ట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం’’ అని అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు చెప్ప‌డ‌టంతో పాటు క‌రోనా వైర‌స్ నుండి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా సూచించారు మెగాస్టార్ చిరంజీవి.

More News

'ఆర్ ఆర్ ఆర్' అంచ‌నాల‌ను పెంచేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్రజా ప్రతినిధులకు వార్నింగ్.. రైతన్నకు అభయం!

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదని.. రేపట్నుంచి రంగంలోకి దిగి క్రియాశీలకంగా పనిచేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో రైతన్నలకు కేసీఆర్ శుభవార్త చెప్పారు.

21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇవాళ అనగా మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని

కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఒలింపిక్స్ క్రీడలపై కూడా పడింది. ఈ క్రమంలో జపాన్‌లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది.

చిరు 152లో రంగ‌మ్మ‌త్త‌ ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఇప్పుడు సెట్స్‌లో ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఇప్ప‌టికే రెజీనా క‌సండ్ర ఓ స్పెష‌ల్