Chiranjeevi: బీజేపీ అభ్యర్థికి చిరంజీవి మద్దతు.. నేనున్నాను అంటూ భరోసా..

  • IndiaGlitz, [Monday,April 15 2024]

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. కానీ రాజకీయాల్లో తన మద్దతు మాత్రం కొంతమందికి తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీకి రూ.5కోట్ల విరాళం ఇచ్చి పరోక్షంగా తన సపోర్ట్ అందించారు. ప్రస్తుతం బీజేపీ నేత సీఎం రమేష్‌కు మద్దతు తెలిపారు. అనకాపల్లి నుంచి ఎంపీగా బీజేపీ తరపున రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు కోసం ఆయనను కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయండి.. మీ వెంట నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు.

అంటే పరోక్షంగా తన మద్దతు టీడీపీ కూటమికే అని తెలిపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి భారీగా విరాళం ఇవ్వడం.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు మద్దతు తెలియజేయడం వంటి పరిణామాలను ఇందుకు ఉదహరిస్తున్నారు. అయితే చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని హస్తం పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమై సినిమాలు చేసుకుంటున్నారు.

ఇటీవల తన జీవితం ఇక సినిమాలకే అంకితం అంటూ స్పష్టంచేశారు. దీంతో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే తాను నేరుగా రంగంలోకి దిగకపోయినా.. ఎన్నికల బరిలో ఉన్న వారికి మాత్రం తన ఆశీస్సులుంటాయని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు తన మద్దతు ఉంటుందని, ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరారు. దీనిని బట్టి చూస్తే చిరు ఏ పార్టీకి మద్దుతుగా లేరని స్పష్టమవుతోంది. కానీ తన శ్రేయోభిలాషులు, సన్నిహితులు పోటీలో ఉంటే మాత్రం వారికి వ్యక్తిగతంగా తన ఆశీస్సులు ఇస్తున్నారు.

ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. 'బింబిసార'తో బ్లాక్‌బాస్టర్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట.. ఈ మూవీతోనూ మెగాస్టార్‌కు మరిచిపోలేని విజయం అందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

More News

Pawan Kalyan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు ఆ నలుగురిదే బాధ్యత: పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారుల చేతే విచారణ చేయించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. ఒకేరోజు రెండు షాక్‌లు..

లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకేసారి రెండు షాక్‌లు తగిలాయి. ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒక్కరైన నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు

Salman Khan: సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో కీలక విషయాలు గుర్తింపు

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌

Vishal: తమిళనాట వేడెక్కిన రాజకీయాలు.. కొత్త పార్టీ పెడతానంటూ విశాల్ సంచలన ప్రకటన..

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటంతో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.