చిరు ప్రీ లుక్ పోస్టర్ అదిరింది..!

  • IndiaGlitz, [Thursday,August 18 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టిన‌రోజు కానుక‌గా ఈనెల 22న‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తాను అని రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఫ‌స్ట్ లుక్ చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే...కొణిదె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న చిరు 150వ చిత్రం ప్రీ లుక్ ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసారు.ఒక మ్యాప్, రెడ్ క‌ల‌ర్ క‌ర్టెన్..ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్ లో క‌నిపిస్తున్నాయి. ఆ మ్యాప్ హైద‌రాబాద్ కి సంబంధించింది అని తెలిసేలా బుద్ధుడు విగ్ర‌హం, చార్మినార్, గోల్కండ కోట క‌నిపిస్తున్నాయి. డిఫ‌రెంట్ గా ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈనెల 22న చిరు పుట్టిన‌రోజు తో పాటు చిరు 150వ చిత్రం ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ కానుండ‌డంతో అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. మ‌రి..చిరు ఫ‌స్ట్ లుక్ ఏస్ధాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

More News

అవసరానికో అబద్ధం సెన్సార్ పూర్తి..!

లోకేష్,రాజేష్,శశాంక్,గీతాంజలి,సందీప్,వెంకీ,ఎం.జి.ఆర్,గిరిధర్,విజయ్ ప్రధాన పాత్రధారులుగా సురేష్ కె.వి తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం.

కార్తీ 'కాష్మోరా' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,

అల్లు అర్జున్ కి ప్రవాసిరత్న పురష్కారం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా పాపులర్ అనే విషయం తెలిసిందే.

విడుదలకు సిద్ధమవుతున్న 'వర్మ vs శర్మ'

మాస్టర్ నార్ని చంద్రాంషువు సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బాబ్ రతన్,బిందు బార్బీ జంటగా నటించిన చిత్రం వర్మ vs శర్మ.

ఎట్టకేలకు నారా రోహిత్ సినిమా విడుదలవుతుంది....

శ్రీ లీల మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'శంకర'.