నంబర్ 20న 'చిరుగొడవలు'

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

రోహిత్, భావిక, సిద్ధార్థ్, రాగ, నాగేంద్ర, హారిక, యోధ, గీతాంజలి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం చిరుగొడవలు'. 11 ప్లస్ మూవీస్ బ్యానర్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ ఫిలిం స్కూల్ విద్యార్థులు ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాల మీద ఆసక్తితో అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడు త్రికరణ్ రెడ్డి దర్శకుడు కావాలనే ఆలోచనతో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సలహాపై అన్నపూర్ణ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో దర్శకత్వశాఖలో డిప్లొమా పూర్తి చేశారు. త్రికరణ్ రెడ్డి దర్శకత్వంలో తొలి చిత్రంగా రూపొందిన చిరుగొడవలు' చిత్రాన్ని జైపాల్ ఏలేటి నిర్మించారు.

ఈ సినిమాలో అందరూ నూతన నటీనటులే నటించారు. ఇంటర్మీడియెట్ వరకు ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు మధ్య జరిగే కథ ఇది. నారాయణ ఎన్నారై. అమెరికన్ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వారికి ఇద్దరమ్మాయిలు పుడతారు. పిల్లలు చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో నారాయణ తన ఇద్దరి పిల్లలైన కత్రిన, ప్రీతిలతో ఇండియా వచ్చేస్తాడు. పెద్దమ్మాయి కత్రిన తన ఇష్టానుసారం నడుచుకుంటుంటే, చిన్నమ్మాయి ప్రీతి నలుగురు ఇష్టాలను తెలుసుకుని ప్రవర్తిస్తుంటుంది. నారాయణ తన ఇద్దరి కుమార్తెలను ఎలా పెంచాడనేదే సినిమా.

గీతా పూనిక్ ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ చిత్రానికి కళ్యాణ్ సమి సినిమాటోగ్రఫీ అందించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

డిసెంబర్ 4న 'శంకరాభరణం'

స్వామి రారా,కార్తికేయ,సూర్య వర్సెస్ సూర్య..ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ,ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసిన కర్ణాటక అభిమానులు..

‘బాహుబలి ది బిగినింగ్’చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభిమానులు కలుసుకున్నారు.

'శివగంగ' ఆడియో విడుదల

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ. శ్రీరామ్,రాయ్ లక్ష్మీ,సుమన్,మనోబాల,వడివుక్కరసి ముఖ్యపాత్రధారులు.

నాగ్ ప్లాన్ అప్పుడేనట...

నాగార్జున ప్రస్తుతం మనం తర్వాత ఆయన‘సోగ్గాడే చిన్ని నాయన’సినిమా షూటింగ్ పూర్త చేశారు.నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తన తో సేమ్ సీజన్ లో వస్తున్న హన్సిక

పాలబుగ్గల సుందరి హన్సికకి అచ్చొచ్చిన డైరెక్టర్ గా సుందర్.సికి మంచి పేరుంది.''తీయా వేలై సెయ్యనుం కుమారా'' (తెలుగులో ''సమ్ థింగ్ సమ్ థింగ్''),''అరణ్ మణై''(చంద్రకళ)చిత్రాలతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయాలను సొంతం చేసుకుంది.