జనవరి 1న వస్తున్న 'చిత్రం భళారే విచిత్రం'

  • IndiaGlitz, [Monday,December 14 2015]

చాందిని ప్ర‌ధాన పాత్ర‌లో భాను ప్ర‌కాష్ బ‌లుసు తెర‌కెక్కించిన కామెడీ థ్రిల్ల‌ర్ చిత్రం భ‌ళారే విచిత్రం. పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రంలో మ‌నోజ్ నందం, అనిల్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ భాను ప్ర‌కాష్ మాట్లాడుతూ...సినిమా నేప‌థ్యంలో రూపొందిన కామెడీ థ్రిల‌ర్ ఇది. క‌మ‌ర్షియ‌ల్ సినినిమాకి కావ‌ల‌సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యుల‌ర్ ఫార్మెట్ కి భిన్నంగా ఉండే చిత్ర‌మిది.

పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కు స్పంద‌న బావుంది. చాందిని న‌ట‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం అన్నారు. నిర్మాత ఉమాకాంత్ మాట్లాడుతూ..ప్ర‌యోగం సినిమా చూసాక భాను ప్ర‌కాష్ లో ఉన్న ప్ర‌తిభ ఏమిటో తెలిసింది. త‌ర్వాత నాకు న‌చ్చిన కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో ఈ క‌థ చెప్పారు. దాంతో నేను నిర్మాత‌గా మారి ఈ సినిమా చేసాను. రెగ్యుల‌ర్ చిత్రాల్లాగా రివేంజ్ స్టోరీ కాదు. కామెడీ, స‌స్పెన్స్, ఎమోష‌న్స్ అన్ని స‌మ‌పాళ్ల‌లో ఉంటాయి. క్లైమాక్స్ ప్ర‌తి ఒక్క‌రి చేత కంటత‌డి పెట్టిస్తుంది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌న్నీ పూర్త‌య్యాయి.

జ‌న‌వ‌రి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు. సౌమ్య‌, శుభ‌శ్రీ, జీవా, సూర్య‌, ప్ర‌భాస్ శ్రీను, అల్ల‌రి సుభాషిని, వేణుగోపాల‌రావు వాసు ఇంటూరి, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి కెమెరా టి సురేంద్ర‌రెడ్డి, ఎడిటింగ్ గోపి సిందం, సంగీతం క‌న‌కేష్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ రాము వీర‌వ‌ల్లి,

More News

హ్యాపీ బర్త్ డే టు రానా..

లీడర్ సినిమాతో కథానాయకుడుగా తెలుగు తెరకు పరిచయమైన యువ హీరో దగ్గుబాటి రానా.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించడం విశేషం.

చిన్న చిత్రాలకు పెద్ద నిర్మాతలు సపోర్ట్ గా ఉండాలి - యం.యం.కీరవాణి

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం‘జత కలిసే’.

'సౌఖ్యం' పాటలు విడుదల

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై గోపీచంద్,రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సౌఖ్యం.ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.

రాజ్ తరుణ్ దర్శకత్వం?

రాజ్ తరుణ్ కి దర్శకత్వం చేయాలన్నది కల.అందుకే దర్శకత్వ శాఖలో పనిచేశారు.అనూహ్యంగా ఉయ్యాల జంపాలా సినిమాతో హీరోగా టర్న్ అయిన రాజ్ తరుణ్ అప్పుడే మూడు హిట్లను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

'ఎక్స్ ప్రెస్ రాజా 'ఆడియో డేట్

ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుంది.మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.