close
Choose your channels

ఒకరు వృద్ధ బానిస.. మరొకరు యువ బానిస, కుక్కల్లా మొరగొద్దు : అంబటి, గుడివాడలకు జనసేన నేతల వార్నింగ్

Tuesday, April 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎవరికో దత్తపుత్రుడు, దగ్గరి పుత్రుడు అంటున్న వైసీపీని 15 సీట్లకే పరిమితం చేస్తామని హెచ్చరించారు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. పవన్ కళ్యాణ్‌పై మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సున్నా పరిజ్ఞానం ఉన్న మంత్రులను ఎదుట పెట్టి, వెనుక సజ్జలతో మాఫియా ఆటను ప్రభుత్వం ఆడిస్తోందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను తిడితేనే ప్రజలు గుర్తిస్తారని మంత్రులు భావిస్తున్నారని.. ఆయనను తిట్టించేందుకే మీకు పదవులను ఇచ్చారంటూ దుయ్యబట్టారు. తాడేపల్లి బంగళాలో భయపడుతూ కొన్ని కుక్కల్ని పవన్ కళ్యాణ్ మీద ఉసిగొలిపే ప్రయత్నం కొందరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేస్తున్న పనులు ఈ ముఖ్యమంత్రిని భయపెట్టాలి లేదా బాధ పెట్టాలి. దీని వల్లనే మంత్రులను రేసు కుక్కల్లా మా మీదకు పంపుతున్నారని హరిప్రసాద్ ఫైరయ్యారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొత్తగా వచ్చిన ఏ మంత్రికీ ఆ శాఖ మీద పట్టు లేదని... కనీసం ఆ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. మంత్రులు ఆయా శాఖల వారీగా ప్రజలకు ఎంతమేర ఉపయోగపడ్డారో వివరించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసి ఆనందం పొందడం సరికాదని.. తాము కూడా మీ వ్యక్తిగత విషయాల్లోకి వస్తే తల ఎక్కడ పెట్టుకుంటారని హరి ప్రసాద్ ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో కార్మికులకు అండగా, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకు తోడుగా, ఉద్యోగులకు చేదోడుగా, అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా పవన్ నిలబడ్డారని ఆయన ప్రశంసించారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద మారుతున్న ఆలోచన తీరుకు భయపడే వ్యక్తిగత విషయాల ప్రస్తావన చేస్తున్నారని హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు.

జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్సీపీ అధినేత సీబీఐ దత్తపుత్రుడు అయితే, వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రశాంత్ కిషోర్ దత్తపుత్రులంటూ సెటైర్లు వేశారు. ప్రశాంత్ కిషోర్ లేకుంటే కనీసం ఓట్లు, సీట్లు కూడా రాని దౌర్భాగ్య పార్టీ మీదంటూ దుయ్యబట్టారు. ప్రజా మద్దతు కూడగడుతున్న పవన్ కళ్యాణ్ మీదికి విష సర్పాలను వదిలిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విష సర్పాలు ఎన్ని వచ్చినా అడ్డుకునే శక్తి పవన్ కళ్యాణ్‌కు వుందన్నారు. సి.బి.ఐ. దత్త పుత్రుడి వృద్ధ బానిస అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖ ఇవ్వడం దౌర్భాగ్యమన్నారు. ఆయనకు డయాఫ్రం వాల్ అంటే తెలియదని, టి.ఎం.సి. అంటే తెలియదని.. పులిచింతల ఏ నది మీద ఉందో తెలియదని కిరణ్ వ్యాఖ్యానించారు. సంజనా, సుకన్యా ప్రాజెక్ట్ అంటే గంట, అరగంటలో పూర్తి చేస్తాడేమోనంటూ ఆయన సెటైర్లు వేశారు.

యువ బానిస గుడివాడ అమర్నాథ్ ఎక్కువ మాట్లాడుతున్నాడని.. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కిరణ్ గుర్తుచేశారు. ఆయన భార్య చెప్పిన విషయాలు రెండో ఎపిసోడ్‌లో బయటపెడతామని.. వ్యక్తిగత విషయాల వరకూ వస్తే మీకు తెలియకుండానే మీ చీకటి బాగోతాలతో రసికరాజాలు అనే సినిమా తీస్తామని కిరణ్ హెచ్చరించారు. ఈ సినిమాను రాజ్ కుంద్రా ద్వారా రిలీజ్ చేయిస్తామని.. జగన్‌కు కాపలా కుక్కలా మొరగొద్దన్నారు. పవన్ కళ్యాణ్ సూచించిన శాంతియుత మార్గం లోనే ముందుకు వెళ్తామని కిరణ్ చెప్పారు. మీరు శ్రుతిమించితే మా వీర మహిళలే మీ భరతం పడతారని... అప్పుడు కనీసం ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.