close
Choose your channels

యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ‘‘చోర్ బజార్’’

Monday, June 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

చోర్ బజార్ సినిమా పాటలు హిట్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇవన్నీ సినిమా మీద పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. బిజినెస్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండటం మూవీ స్థాయిని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. ఈనెల 24న సినిమాను విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తాజాగా ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.