ఏపీలో సంక్రాంతి, క్రిస్మస్ సెలవులు ఇవే.. పండుగే పండగ!

  • IndiaGlitz, [Saturday,December 14 2019]

పిల్లలు, పెద్దలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరిగ్గా నెలరోజుల్లో సంక్రాంతి రానుంది. అయితే ఈ పండుగకు గాను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తుందో..? ఎన్నిరోజులు సెలవులు ఇస్తుందో..? అని విద్యార్థుల్లో.. తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు శనివారం నాడు ఏపీ ప్రభుత్వం తెరదించింది. సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.

మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు ప్రభుత్వం ఈ సెలవులు ప్రకటించింది. ఇక జూనియర్‌ కాలేజీల విషయానికొస్తే.. జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు విద్యా విషయక వార్షిక ప్రణాళికలో పేర్కొంది. కాగా.. వరుసగా పది రోజుల పాటు సెలవులు రావడంతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కుటుంబీకులు సొంతూళ్లకు పోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.