Lokesh:రెండో రోజు ముగిసిన సీఐడీ విచారణ.. సమయం వృథా చేశారని లోకేశ్ ఆగ్రహం

  • IndiaGlitz, [Wednesday,October 11 2023]

తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల పాటు లోకేశ్‌ను అధికారులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్‌.. హైకోర్టు ఒక్క రోజే విచారించాలని చెప్పినా రెండో రోజు కూడా విచారణకు పిలిచారని.. కానీ అధికారులు అడిగినందుకు రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యానని తెలిపారు. నిన్న 50 ప్రశ్నలు అడిగితే.. ఇవాళ 47 ప్రశ్నలు అడిగారని పేర్కొ్న్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారన్నారు.

భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్స్ చూపించారు..

ఈ కేసులో తనకు, తన కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదన్నారు. ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగితే అధికారులు సమాధానం చెప్పలేదని లోకేశ్ వెల్లడించారు. ఏం లేని కేసులో అనవసరంగా రెండు రోజుల పాటు తన సమయం వృథా చేశారని చెప్పుకొచ్చారు. విచారణలో భాగంగా మా అమ్మ నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించారని.. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నించగా సమాధానం రాలేదన్నారు. దీన్ని కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నానని.. అలాగే ఐటీ శాఖకు కూడా లేఖ రాస్తానని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రావాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్ డెవలపర్ ఎవరు? సీడ్ కాపిటల్ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీ సీఆర్డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఎవరు నిర్ణయించారు? అనే ప్రశ్నలు అడిగారని తెలిపారు.

అధికారుల పేర్లు ఎందుకు ఎఫ్ఐఆర్‌లో లేవు..

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచారని పునరుద్ఘాటించారు. ఈ కేసులో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారన్నారు. నాటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లంపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. సంతకాలు చేసిన అధికారులను విచారణకు పిలవకుండా పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును 32 రోజులుగా రిమాండ్‌లో ఉంచడం బాధాకరమని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌కు కార్యదర్శిగా ప్రేమచంద్రారెడ్డి వ్యవహరించారని.. ఆయన గుజరాత్ వెళ్లి స్కిల్ ప్రాజెక్టు పరిశీలించి అద్భుతం అని చెప్పారన్నారు. ఈ ప్రాజెక్టును వెంటనే రాష్ట్రంలో అమలు చేయాలని రూ.285 కోట్లను విడుదల చేయండని ఇచ్చారని.. కానీ ఆయన పేరు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు లేదని లోకేశ్ నిలదీశారు.

More News

Rajasthan Election:రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేది మార్పు.. ఎందుకంటే..?

ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

God:జయం రవి, నయనతార మూవీ ‘గాడ్’ సెన్సార్ పూర్తి.. అక్టోబర్ 13న రిలీజ్

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’.

Aadikeshava:'ఆదికేశవ' చిత్రం నుంచి హే బుజ్జి బంగారం సాంగ్ విడుదల

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, అందాల బామ శ్రీలీల హీరోయిన్‌గా తెరెకెక్కుతున్న చిత్రం 'ఆదికేశవ'.

KCR: మరోసారి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న గులాబీ బాస్.. అక్కడి నుంచే ప్రచారం షురూ

గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌లు ఎక్కువ అని అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేయాలన్నా ముహుర్త బలాన్ని నమ్ముతుంటారు.

Nadendla:టోఫెల్ శిక్షణ పేరుతో వేల కోట్ల రూపాయల లూటీకి ప్రభుత్వం సిద్ధమైంది: నాదెండ్ల

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ పేరుతో వైసీపీ ప్రభుత్వం లూటీకి తెరతీసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు