విడుదలకు సిద్ధమవుతున్న 'సినీ మహల్'

  • IndiaGlitz, [Monday,January 25 2016]

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సినీ మహల్. రోజులకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కుతోంది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ...

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ 'సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోవడానికి సిద్ధమైంది. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతానికి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రత్యేకగీతంలో నటించిన సలోనిగారికి థాంక్స్. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫ్రిభ్రవరిలో నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, నిర్మాతం బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

More News

హాలీవుడ్ మూవీలో ధనుష్....

దీపికా ప‌దుకొనే, ప్రియాంక‌చోప్రా, ఓంపురి, సోనూసూద్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్, అనిల్ క‌పూర్‌, మ‌ల్లికా షెరావ‌త్ త‌ర్వాత మ‌రో న‌టుడు ధ‌నుష్ హాలీవ‌డ్ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి రెడీ అయ్యాడు.

'సరైనోడు' మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం

బాహుబ‌లి స్టుపిడ్ సినిమా అంటున్న అల‌నాటి న‌టి

బాహుబ‌లి సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా ఇంత వ‌సూలు చేస్తుందా..? తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తీసే ద‌ర్శ‌కుడు ఉన్నాడా..? అని బాలీవుడ్ సైతం ఆశ్య‌ర్య‌పోయేలా చేసింది.

సూర్య 24 రిలీజ్ కి ముహుర్తం కుద‌రింది

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో  సూర్య నిర్మిస్తున్నారు.

బ్యాంకాక్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'.