రానా సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ మారాడు

  • IndiaGlitz, [Monday,November 18 2019]

'బాహుబ‌లి', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు రానా ద‌గ్గుబాటి త్వ‌ర‌లోనే 'విరాట‌ప‌ర్వం' షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సినిమాటోగ్రాప‌ర్ జ‌య‌కృష్ణ‌కి 'విరాట‌ప‌ర్వం' ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఉన్న క‌మిట్‌మెంట్స్ కార‌ణంగా ఆయ‌న ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంటున్నాడు.

ఆయ‌న స్థానంలో 'మ‌హాన‌టి' చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించిన డియోల్ షానెజ్‌ను కెమెరామెన్‌గా తీసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే 'విరాట‌ప‌ర్వం' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొంత మేర చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు రానా పాల్గొనాల్సిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్స్ రానాపై ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. డి.సురేశ్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.