ఈ మూడ్రోజుల్లో 3 రాజధానులపై తేలిపోనుంది!

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నామ మాత్రానికే ప్రకటన చేశారే తప్ప ఇంతవరకూ క్లారిటీగా స్పందించలేదు. దీంతో రాజధాని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారంపై రెండు కమిటీలు నివేదికలను సీఎంకు అందజేయగా హై పవర్‌ కమిటీ పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉంటే పండుగ తర్వాత మూడు రాజధానులపై తేలిపోనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ మూడు బిల్లులపై..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈనెల మూడురోజుల పాటు సమావేశం జరగనుంది. జనవరి 20, 21, 22 తేదీల్లో శాసన సభ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయమై అసెంబ్లీ కార్యదర్శికి శాసన సభ వ్యవహారాల మంత్రి సమాచారం పంపారు. ఈ సమావేశాల్లో భాగంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్ట సవరణతో పాటు మరో మూడు బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుల్లో ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లు, మూడు రాజధానులపై ఈ సమావేశాల్లో నిశితంగా చర్చించనున్నారు.

ఈ మూడ్రోజుల్లోనే..!
ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరగనుందని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు. 20న ఉదయం 9:30గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ..హై పవర్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. మొత్తానికి చూస్తే ఈ మూడ్రోజుల్లో మూడు రాజధానులు ఉంటాయా..? లేదా..? అనేది తేలిపోనుంది. అయితే ఈ మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా..? అస్సలు వెనక్కి తగ్గేది లేదని ముందుకెళ్తుందా..? అనేది తెలియనుంది.

More News

బొంబాట్‌లో `ఇష్క్ కియా...' సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని

'డిస్కోరాజ' సెకండ్ టీజర్ విడుదల

మాస్ మహా రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీజేపీకి ఊహించని షాక్!

ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఆప్ ఊహించని షాకిచ్చింది.

ఢిల్లీలో పవన్ ‘పొత్తు’ బిజీ.. బాంబ్ పేల్చిన కీలకనేత!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో దోస్తీకి ఫిక్స్ అయ్యారా..? రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా..?

లవ్యూ పవన్ కల్యాణ్ మామా..: సాయి తేజ్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతీ తెరకెక్కించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’.