close
Choose your channels

‘ఆదిపురుష్’లో అజయ్ దేవగణ్ పాత్రపై క్లారిటి..!

Monday, October 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆదిపురుష్’లో అజయ్ దేవగణ్ పాత్రపై క్లారిటి..!

ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కొందరు నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో కూడా కొందరివి మాత్రమే పాత్రలు ఫిక్స్ అయ్యాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ మరో ప్రధాన పాత్ర అయిన రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారనే విషయం తెలుసు కానీ ఆయన పాత్రపై క్లారిటీ అయితే రాలేదు.

తాజాగా అజయ్ దేవగణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. సీత పాత్రలో దీపికా పదుకుణె నటిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే అధికారిక సమాచారమైతే లేదు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ తారాగణం నటిస్తోందన్న వార్తలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.