close
Choose your channels

బన్నీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ!!

Tuesday, July 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బన్నీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ!!

ఈ ఏడాది ప్రారంభంలో వ‌చ్చిన సంక్రాంతికి ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో బారీ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. రీసెంట్‌గా సుకుమార్‌తో హ్యాట్రిక్ మూవీగా ‘పుష్ప‌’ సినిమాను చేయ‌డానికి ఓకే చెప్పారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా ప‌రిస్థితులు చ‌క్కబ‌డ్డ త‌ర్వాత ప్రారంభ‌మ‌వుతాయి. అయితే లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో బ‌న్నీ చేయ‌బోయే నెక్ట్స్ మూవీ ఇదేనంటూ వార్తొక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ బ‌న్నీతో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని, నేటి రాజ‌కీయ నాయ‌కులు వ‌ల్ల ఇబ్బందులు ప‌డ్డ ఓ సామాన్యుడు వారిపై ఎలా తిర‌గ‌బడ్డాడ‌నేదే సినిమా క‌థాంశం అని అంటున్నారు.

అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని దర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయి. యాత్ర త‌ర్వాత యాత్ర 2 చేయ‌డంపై మ‌హి ఫోక‌స్ చేశాడ‌ని అంటున్నారు కొంద‌రు. ఇంత వ‌ర‌కు మ‌రో చిత్రం తెర‌కెక్కించ‌డానికి ఓకే చెప్ప‌లేదు. మ‌రో ప‌క్క బ‌న్నీ ముందు పుష్ప‌ను పూర్తి చేసిన త‌ర్వాతే త‌దుప‌రి సినిమా గురించి ఆలోచిస్తార‌ని స‌ద‌రు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.