‘సరిలేరు..’, ‘అల..’ రిలీజ్‌ డేట్స్‌‌పై క్లారిటీ వచ్చేసింది

  • IndiaGlitz, [Saturday,January 04 2020]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో..’ సినిమాల రిలీజ్‌ డేట్స్ మారాయని గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అంతేకాదు.. రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. కొందరేమో అబ్బే అదేం లేదు.. సినిమా అనుకున్న మాదిరిగా అదే డేట్‌కు వస్తున్నాయని చెబుతున్నప్పటికీ.. ఈ వ్యవహారం టాలీవుడ్‌లో మాత్రం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఓ వైపు సోషల్ మీడియాలో బన్నీ వర్సెస్ మహేశ్ ఫ్యాన్స్ ‘మా హీరో ముందొస్తున్నాడు..’ అని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉండటం.. మరోవైపు మీడియాలో రోజుకో రకంగా వార్తలు వస్తుండటంతో అసలు ఏది నమ్మాలో.. ఏది నమ్మరాదో తెలియక మెగాభిమానులు, బన్నీ ఫ్యాన్స్.. మహేశ్ వీరాభిమానులు కన్ఫూజన్‌లో పడ్డారు. అయితే.. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటం.. పుకార్లు ఎక్కువవుతుండటంతో ఈ వ్యవహారంపై అధికారికంగా దర్శకనిర్మాతలు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది.

మార్పుల్లేవ్..!
అయితే.. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు శనివారం సాయంత్రంతో క్లారిటీ వచ్చేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా యథావిథిగా జనవరి 11న.. ‘అల వైకుంఠపురంలో..’ సినిమా జనవరి 12న విడుదల కానున్నాయని ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ముందుగా అనుకున్న విధంగా ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. సంక్రాంతికే ‘సరిలేరు’, ‘అల’ థియేటర్లలోకి వస్తాయని తేల్చిచెప్పింది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రకటనతో ఈ ఇద్దరి హీరోల అభిమానుల్లో కన్ఫూజన్, టెన్షన్ తగ్గిందని చెప్పుకోవచ్చు. కాగా.. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయ్.. మరి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచేదెవరో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

అనుకున్న టైమ్‌కే ‘దర్బార్’..!
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన ‘దర్బార్‌’ సినిమా జనవరి-09న విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని కూడా ముందుగా అనుకున్నట్లుగానే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ను ఆపేయాలని సంబంధిత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు హైకోర్టు నోటీసులు పంపడం జరిగింది. దీంతో అసలు అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందో లేదో అని చిత్రబృందం, అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. అయితే శనివారం నాడు ప్రొడ్యూసర్ గిల్డ్స్‌ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది.