చ‌ర‌ణ్ మూవీ రిలీజ్ డేట్‌ పై క్లారిటీ

  • IndiaGlitz, [Wednesday,October 31 2018]

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు.

రెండు, మూడు రోజుల క్రితం సినిమా స్లో ఫేజ్‌లో ర‌న్ అవుతుంద‌ని.. సినిమా విడుద‌ల జ‌న‌వ‌రిలో ఉండ‌క‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వినిపించాయి. దీనిపై చిత్ర యూనిట్ వివ‌ర‌ణ ఇస్తూ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

సినిమా అనుకున్న స‌మ‌యం ప్ర‌కారం పూర్త‌వుతుంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. దీంతో సినిమా విడుద‌ల‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయ్యింది.

బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు.

More News

ర‌వితేజ‌తో పాయ‌ల్ రాజ్‌పుత్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. అందులో విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తుంటే.. మ‌రో చిత్రం సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది.

'యాత్ర' షూటింగ్ పూర్తి

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'యాత్ర‌'.

ఫ్యాన్సీ రేటుకు 'అఅఆ' హ‌క్కులు

ర‌వితేజ మూడు షేడ్స్‌లో న‌టించిన చిత్రం 'అమ‌ర్ అక్ట‌ర్ ఆంటోని'. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

రాజ‌కీయాల్లోకి వ‌స్తా - వ‌ర‌ల‌క్ష్మి

త‌మిళంలో 22 సినిమాల్లో న‌టించిన శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌లక్ష్మి 'పందెంకోడి 2',

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్ ఆర్ ఆర్‌

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుండి అంచ‌నాల‌ను క్రియేట్ చేసుకుంది.