క‌బాలి క్రేజ్ కి నిద‌ర్శ‌నం ఇదే..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. అటు అభిమానులు - ఇటు ఇండ‌స్ట్రీ క‌బాలి చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక క‌బాలి గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే...క‌బాలి ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌బాలి పోస్ట‌ర్స్ విమానాల‌పైన‌, వెండి నాణేల పైన ద‌ర్శ‌న‌మిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి.

అంతే కాదండోయ్ కబాలి పేరుతో ఏకంగా సిమ్ కార్డులు సైతం వ‌స్తున్నాయి. అయితే...క‌ర్నాట‌క‌లో ర‌జ‌నీ వీరాభిమాని త‌న కారు నెంబ‌ర్ ప్లేటులో క‌బాలి అని రాయించుకున్నాడు. క‌బాలి అని క‌నిపిస్తున్న ఆ కారు నెంబ‌ర్ కెఎ 8ఎ ఎల్ 1. ఈ నెంబ‌ర్ ని ఇంగ్లీషులో క‌బాలి అని క‌నిపించేలా డిజైన్ చేయించుకున్నాడు. ర‌జ‌నీ పై అభిమానంతో కావాల‌ని క‌ర్నాట‌క రిజిష్ట్రేష‌న్ లో ఈ నెంబ‌ర్ తెచ్చుకున్నాడ‌ట‌. దీనిని బట్టి అర్ధం చేసుకోవ‌చ్చు క‌బాలి (ర‌జ‌నీ) క్రేజ్ ఏరేంజ్ లో ఉందో..?

More News

వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటైల్స్..

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం బాబు..బంగారం.యువ దర్శకుడు మారుతి తెరకెక్కించిన బాబు...బంగారం

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన అఖిల్..

నాగ చైతన్య,సమంత లవ్ లో ఉన్నారని ఓ పక్క ప్రచారం జరుగుతుంటే...ఎవరూ ఊహించని విధంగా అఖిల్ నేను ప్రేమలో పడ్డాను అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

25 కోట్ల 'బిచ్చగాడు'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని,సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’

ముందుకొచ్చిన 'మనమంతా'

జాతీయస్థాయి ఉత్తమనటుడు మోహన్ లాల్.విలక్షణ నటి గౌతమి ప్రధానపాత్రల్లో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'మనమంతా'.

అంప‌శ‌య్య న‌వ‌ల‌కు వెండితెర పై మంచి న్యాయ‌మే జ‌రిగింది - ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు

‘అంపశయ్య’ నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ 1969లో రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది.