హైకోర్టుని ఆశ్ర‌యించిన సీఎం జ‌గ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో వ్య‌క్తిగ‌త హాజ‌రు నుండి మిన‌హాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టుని ఆశ్ర‌యించారు. గ‌తంలో సీబీఐ, ఈడీ శాఖ‌లు జ‌గ‌న్‌పై అక్ర‌మాస్తుల కేసులు వేశాయి. వీటికి సంబంధించి గ‌తంలో ఆయ‌న అరెస్ట్ కూడా అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుండి సీబీఐ కోర్టులో కేసు న‌డుస్తూనే ఉంది. ముఖ్య‌మంత్రి కాక మునుపు కోర్టుకు హాజ‌ర‌వుతూ వ‌చ్చిన వై.ఎస్‌.జ‌గ‌న్‌..ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాలంటే ఇబ్బంది అవుతుంద‌ని, త‌ను కోర్టుల్లో కాల‌యాప‌న చేస్తే రాష్ట్ర ప‌రిపాల‌న‌, విధులకు అడ్డంకిగా మారుతుంద‌ని ఆయ‌న సీబీఐ కోర్టును కోరారు. అయితే స‌ద‌రు సీబీఐ కోర్టు జ‌గ‌న్ విన్న‌పాన్ని తోసిపుచ్చింది.

ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయ‌న కార‌ణాన్ని చూపిస్తూ త‌న వ్య‌క్తిగ‌త హాజ‌రు నుండి మిన‌హాయింపు ఇవ్వ‌క‌పోవ‌డం స‌రికాద‌ని జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు హైకోర్టులో పిటిష‌న్ వేశారు. జ‌గ‌న్ పిటిష‌న్‌పై రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం విచార‌ణ జ‌రప‌నుంది. జ‌న‌వ‌రి 31న జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తం కోర్టుకు హాజ‌రు కావాల‌ని సీబీఐ కోర్టు ఇటీవ‌ల జ‌గ‌న్‌ను ఆదేశించింది. ప్ర‌తివారం ఏదో కార‌ణాన్ని చూపుతున్నార‌ని, ఈ నెల 31న కోర్టుకు హాజ‌రు కాకుంటే త‌గిన ఉత్త‌ర్వులు జారీ చేయాల్సి ఉంటుంద‌ని సీబీఐ కోర్టు పేర్కొంది. అక్ర‌మాస్తులు, మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద ఈడీ దాఖ‌లు చేసిన కేసుల్లో జ‌గ‌న్ నిందుతుడుగా ఉన్న జ‌గ‌న్ కోర్టుకు త‌ప్ప‌కుండా హాజ‌రు కావాల్సిందేన‌ని కోర్టు ఇటీవ‌ల తెలియ‌జేసింది.

More News

మనందరిలో `అశ్వథ్థామ` ఉంటాడు - మెహరీన్‌

ఈ ఏడాది జనవరిలో ‘ఎంతమంచివాడవురా’, ‘పటాస్‌' చిత్రాలతో లో మన ముందుకు వచ్చిన మెహరీన్‌..జనవరి చివరి వారంలో ‘అశ్వథ్థామ

ఫిబ్రవరి 7న వస్తున్న 'స్టాలిన్'

వైవిధ్యభరిత చిత్రాలనే కాదు మాస్ చిత్రాలను చేస్తూ ఆల్ రౌండ్ కధానాయకుడిగా జీవా  పేరుపొందారు.

వైఎస్ ఎంతో కష్టపడి తెస్తే.. జగన్ ఎందుకీ ఆలోచన!?

అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కష్టపడి తెచ్చిన ఓ భగీరథ ప్రయత్నాన్ని .. ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ‘అస్సలు అది వద్దంటే వద్దు’

'రైట్ రైట్ బగ్గిడి గోపాల్' బయోపిక్ ఫిబ్రవరి 28న విడుదల

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్, మాస్టర్ బగ్గిడి చేతన్ రెడ్డి, మాస్టర్ బగ్గిడి నితిన్ సాయి రెడ్డి సమర్పించు బగ్గిడి గోపాల్. అర్జున్ కుమార్ దర్శకత్వంలో

విక‌సించిన సినీ ప‌ద్మాలు

కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ ఏడాది ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ప‌ద్మ పుర‌స్కారాలు వ‌రించాయి.