Geethanjali: గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ భరోసా.. రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటన..

  • IndiaGlitz, [Tuesday,March 12 2024]

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేక ప్రమాదమా..? అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ సెక్రటరీ హరికృష్ణ వెల్లడించారు.

సోదరి గీతాంజలి విషాద ఘటనను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. చలించిపోయిన ముఖ్యమంత్రిగారు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. తల్లిలేని లోటును తీర్చలేకపోయినా, ఆ పసిబిడ్డల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. స్పందించి అండగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు ఆమె మరణంపై ఆయన మరో ట్వీట్ చేశారు. ఆ అమాయకపు పసి బిడ్డలను చూస్తే చాలా బాధేస్తోంది. ప్రాణం కన్నా ప్రేమించే కన్న బిడ్డల్ని అనాథలను చేసి, పేగుబంధాన్ని తెంచుకుని ఆ తల్లి వెళ్ళిపోయిందీ అంటే, ఆమె పడ్డ మానసిక క్షోభ భరించలేనిది. పగవాడికి కూడా ఆ కష్టం రావద్దు. ఆ పిల్లలను ఆదుకోవడమే నివాళి. ఈ విషాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతాం అని తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలికి ఇటీవలే ప్రభుత్వం తరపున ఇంటిస్థలం పట్టా మంజూరు అయింది. పట్టాను స్థానిక ఎమ్మెల్యే చేతినుంచి అందుకున్న గీతాంజలి సంతోషంతో మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలను టీడీపీ, జనసేన కార్యకర్తలు విపరీతంగా ట్రోలింగ్ చేయడం వల్ల మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన మాత్రం ఆమె వీడియో వైరల్ కాక ముందే ప్రమాదానికి గురైందని ఆరోపిస్తు్న్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగింది..? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

More News

Vijay Thalapathy: సీఏఏ చట్టం అమలుపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర ఆగ్రహం

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

YCP MLC: ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు.. మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం..

ఏపీ ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఎత్తులు పైఎత్తులతో అధికార, విపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తమను కాదని వెళ్లిన నేతలపై అధికార వైసీపీ గుర్రుగా ఉంది.

మోదీ ఏపీ పర్యటన ఖరారు.. టీడీపీ-బీజేపీ-జనసేన భారీ బహిరంగసభకు హాజరు..

ఏపీలో ఎన్నికల రాజకీయం రంజుగా మారబోతుంది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది.

Vande Bharat: ఏపీలో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.

TDP-BJP-JSP: తేలిన పొత్తు లెక్క.. పోటీ చేసే స్థానాలు ప్రకటించిన టీడీపీ-బీజేపీ-జనసేన..

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై కూడా క్లారిటీ వచ్చేసింది. సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం జరిగింది.