నాకున్నది ఒక్క భార్యే.. కొందరేమో నాలుగో పెళ్లి కోసం తాపత్రయం!

  • IndiaGlitz, [Monday,December 09 2019]

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’పై గత పదిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటు జనాల్లోనే కాదు.. చట్ట సభల్లో సైతం దీనిపై చర్చలు జరుపుతున్నారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 26 ఏళ్ల దిశ.. టోల్ గేట్ వద్ద బైకు ఆపితే, ఆ బైకును పంక్చర్ చేసి, సాయం చేస్తున్నట్లు నటించి, అత్యాచారం చేసి కాల్చేశారని ఆయన ఒకింత భావేద్వేగానికి లోనయ్యారు. ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందించాలి? రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? అన్న విషయం తనకూ తెలిసిందన్నారు. నిజంగా ఈ ఘటన చూశాకా చాలా బాధ అనిపించిందని.. ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి? అన్న ప్రశ్న తలెత్తిందని జగన్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసిన తర్వాత నేరస్థులను కాల్చేసినా తప్పులేదు అనిపించదని జనగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

పవన్‌పై మరోసారి పరోక్ష విమర్శలు!
‘నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.. చెల్లి ఉంది. భార్య ఉంది.. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా. వారికి ఏమైనా జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తాను అధ్యక్షా?. మన ఇళ్లల్లోని వారికి ఇటువంటి దారుణం జరిగితే ఎంతో తల్లడిల్లిపోతాం. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలన్నారు. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా..!. చిన్నపిల్లలపై జరిగిన నేరాలపై కూడా వేలాది కేసులు నమోదయ్యాయి. ఇంక కొందరు ఉన్నారు అధ్యక్షా.. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో అధ్యక్షా.. ఒకరు సరిపోరు.. ఇద్దరు సరిపోరు.. ముగ్గురు సరిపోరు.. నలుగురు పెళ్లాలు కావాలని తాపత్రయపడుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై 2014, 2015, 2016, 2017, 2018ల్లో వందలాది కేసులు నమోదయ్యాయి అధ్యక్షా..’ అని స్పీకర్ తమ్మినేనితో జగన్ వివరించారు.

చంద్రబాబుపై విమర్శలు!
‘మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పరిపాలన కొనసాగింది. ఆయన కాలంలో మహిళలపై వేలాది నేరాల కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, వరకట్నం కేసులు వంటివి ఎన్నో నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో నేరాల రేటు అధికంగా ఉంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పైనా జగన్ విమర్శలు గుప్పించారు.

More News

శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల

ఈ సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ... నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి మొదటి ఓనమాలు దిద్దించింది మా అన్నయ్య కళ్యాణ్ గారు..

అబ్బే నేను వైసీపీలోకి వెళ్లట్లేదు.. మా వాళ్లు వెళ్తున్నారు..!

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని

అచ్చెన్నా.. ఎలా ఉంది..: కారు ప్రమాదంపై జగన్ ఆరా

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారు ఇటీవలే ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

కోమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై నూతన దర్శకులు కొమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఒక పాట మినహా

ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదని తెలుస్తోంది.