సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..

  • IndiaGlitz, [Monday,October 19 2020]

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఐదేళ్ల క్రితం పిన తల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురై.. ఆసుపత్రి పాలైంది. విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన కుటుంబంతో సహా వెళ్లి ప్రత్యూషను పరామర్శించి.. ఆమెను దత్తత తీసుకున్నారు. అనంతరం ప్రత్యూష సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగ క్షేమాలను చూస్తోంది.

ప్రస్తుతం ప్రత్యూష నర్సింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. అయితే ప్రత్యూష నిశ్చితార్థం తాజాగా జరిగింది. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడై చరణ్‌రెడ్డిని ప్రత్యూష వివాహమాడబోతోంది. ప్రస్తుతం చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం పూర్తిగా ఆరోగ్యం దెబ్బతిని చాలా దయనీయ స్థితిలో కనిపించిన ప్రత్యూష.. ప్రస్తుతం ఆరోగ్యపరంగా, విద్యాపరంగా చక్కగా ఎదిగింది. తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని పంచుకోబోతోంది. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో ప్రత్యూషను కలిసి విషయం చెప్పాడు. దీంతో ఆమెకూడా పెళ్లికి అంగీకరించింది.

ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు.. ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు ప్రత్యూష వివాహ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్.. ఆమెను ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ప్రత్యూష పెళ్లాడబోయే యువకుడి వివరాలను తెలుసుకుని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నిశ్చితార్థానికి వెళ్లమని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ డి.దివ్యను ఆదేశించడంతో ఆమె వేడుకను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి అండతోనే తాను కోలుకున్నానని.. ఓ మంచి కుటుంబంలోకి వెళుతున్నానని ప్రత్యూష తెలిపింది.

More News

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వెంటనే సండే ఫన్‌డే స్టార్ట్ చేశారు. నోయెల్ సంచాలక్‌గా డాట్స్ గేమ్‌ను నాగ్ స్టార్ట్ చేశారు.

దేశంలో ముమ్మర దశను దాటిన కరోనా.. అంతం అప్పుడే..

భారత్‌లో కరోనా అంతం ఎప్పుడు? అసలు ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటి సమాధానాలిచ్చింది.

ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం

తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.

నారప్ప కూడా షురూ చేయ‌బోతున్నాడు...!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగు రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నిహారిక డెస్టినేష‌న్ పెళ్లి...!

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జ‌ర‌నుందనే వార్త‌లు ఆమె ఎంగేజ్‌మెంట్ స‌మ‌యంలో వినిపించాయి.