close
Choose your channels

కె.విశ్వనాథ్‌ని కలిసి సీఎం కె.సి.ఆర్

Monday, August 12, 2019 • తెలుగు Comments

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుస్తున్నారు` అనే వార్త బయటకు రాగానే కె.విశ్వనాథ్‌కి ఏమైంది? అనే వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ విశ్వనాథ్ తన ఆరోగ్యానికి ఏమీ కాలేదని.. మర్యాద పూర్వకంగానే కె.సి.ఆర్ తనను కలవబోతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు.

అన్నట్లుగానే కె.సి.ఆర్ .. కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కె.సి.ఆర్ వెళ్లిపోయిన అనంతరం కె.విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ `కుచేలుడు ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుంద`ని అన్నారు. కె.సి.ఆర్ తనను మర్యాద పూర్వకంగానే కలిశారని, రాత్రి తన సినిమాలోని ఓ పాటను చూసిన ఆయన తనను కలవాలనుకుంటున్నట్లు ఫోన్ చేసి వచ్చి కలిశారని, ఇద్దరి మధ్య సాహిత్యానికి సంబంధించిన చర్చ జరిగిందని తెలిపారు. తన గురువు తనకు నేర్పిన పద్యం గురించి కూడా కె.సి.ఆర్ తనతో చర్చించారని.. కె.సి.ఆర్‌లోని ఇన్ని కోణాలను తాను ఊహించలేదని ఆయన తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz