CM KCR:కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనవాయితీ ప్రకారం ప్రతిసారి ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించే గులాబీ బాస్.. ఈసారి కూడా అదే ఆచారాన్ని కొనసాగించారు. ఇవాళ ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో కేసీఆర్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకన్న సన్నిదిలో నామినేషన్‌ పత్రాలపై కేసీఆర్‌ సంతకాలు చేశారు.

అనంతరం ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావుతో పాటు సీనియర్ నేతలు, అధికారులు ఉన్నారు. కాగా ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీ ఉదయం గజ్వేల్‌ నియోజకవర్గంలో, మధ్యాహ్నం కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే ప్రజా ఆశ్వీరాద సభల్లో పాల్గొననున్నారు.

కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌కు గెలుపొందుతూ వస్తున్నారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలోనే నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించారు. అలాగే 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్‌.. ఈ ఆలయంలోనే పూజలు చేసి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీని ప్రకటించడం విశేషం.

More News

Small Parties:పోటీకి దూరంగా చిన్న పార్టీలు.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్‌..?

తెలంగాణ ఎన్నికల్లో రోజురోజుకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా చిన్న పార్టీలు పోటీ నుంచి తప్పుకుంటున్నాయి.

Wines Bandh :మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మూడు రోజలు వైన్స్ బంద్..

తెలంగాణలో మందుబాబులకు కేంద్రం ఎన్నికల సంఘం బ్యాడ్ న్యూస్ అందించింది. నవంబర్ 30న పోలింగ్ సందర్భంగా

Hi Nanna:ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి.. హాయ్ నాన్న నుంచి ఫీల్‌గుడ్ సాంగ్..

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది.

Purandeshwari:సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సీజేఐకి పురందేశ్వరి లేఖ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ నేతల మధ్య రోజురోజుకు రాజకీయ దుమారం రేగుతోంది.

Guntur Karam:‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఆడియో క్లిప్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.