బీసీసీఐ గంగూలీకి సీఎం దీదీ అభినందనలు!

  • IndiaGlitz, [Monday,October 14 2019]

బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన సౌరభ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే.. దాదాపు గంగూలీనే ఏకీగ్రవంగా ఎన్నికవుతారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో.. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

దీదీ ట్వీట్ సారాంశం..!
‘బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వనున్న సౌరవ్ గంగూలీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పదవీకాలంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఆశిస్తున్నాను. మీరు భారత్‌ను, బంగ్లా (పశ్చిమబెంగాల్) ను గర్వించేలా చేశారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా మీరందించిన సేవలకు సంతృప్తి చెందాం. మీ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ మమతా ట్వీట్ చేశారు.

కాగా.. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పదవిలో సౌరవ్ గంగూలీ 2020 సెప్టెంబర్‌ వరకూ మాత్రమే కొనసాగగలడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పుతారు.

More News

బాలీవుడ్‌ హీరోయిన్స్‌లో టాప్ రెమ్యునరేషన్ ఎవరికంటే..

బాలీవుడ్‌‌ నటీమణుల రెమ్యునరేషన్‌‌ గురించి సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు బాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న హీరోయిన్లెవరు..?

ట్రైలర్ తో హైప్ ను క్రియేట్ చేస్తున్న 'ఖైదీ'

కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బేనర్ పై లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో

చిరు కెరీర్‌లో మ‌రో రికార్డ్‌

సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి త‌న 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. `ఖైదీ నంబ‌ర్ 150` సినిమాతో వంద‌కోట్ల క్ల‌బ్‌లో

రైతన్నలకు వైఎస్ జగన్ సర్కార్ మరో వరం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నాలుగు నెలల వ్యవధిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక,

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో