Revanth Reddy and KCR:ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

  • IndiaGlitz, [Friday,February 23 2024]

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha)మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) కూడా లాస్య మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(CHANDRABABU) కూడా లాస్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే లాస్య కూడా చనిపోవడం దురదృష్టకరం. ఆమెకు ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉండగా.. విధి మరొకటి తలిచింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇక మాజీ మంత్రి కేటీఆర్ కూడా లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'లాస్య నందిత చనిపోయారన్న విషాద వార్తతో నిద్రలేచా. వారం క్రితమే నన్ను కలిశారు. గొప్ప నాయకురాలిగా ఎదుగుతున్న సమయంలోనే యువ ఎమ్మెల్యే చనిపోవడం బాధాకరం'అంటూ ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పటాన్‌ చెరులోని అమేథా ఆస్పత్రికి చేరుకుని లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

More News

Political Leaders:రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న రాజకీయ నేతలు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మరోసారి ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య హఠాన్మరణం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్మే లాస్య సందిత(Lasya Nanditha)రోడ్డు ప్రమాదంలో హఠానర్మణం చెందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

IPL:క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. 

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ 2024 షెడ్యూల్(IPL 2024 Schedule) వచ్చేసింది.

TDP Jan Sena:టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ముగిసింది.

Janasena:త్వరలోనే జనసేనలోకి మాజీ మంత్రి.. అక్కడి నుంచి పోటీ..!

ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్‌లు ఎక్కువైపోతున్నాయి.