చిరంజీవికి సీఎం జగన్ కృతజ్ఞతలు.. క్రెడిట్ వారిదే!

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించినందుకు గానూ జగన్ ప్రభత్వంపై ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పై కొన్ని వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సాధించిన ఈ ఘనతని ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

జగన్ ఆదర్శవంతమైన నాయకత్వం వల్లే ఈ రికార్డ్ సాధ్యమైందని చిరంజీవి ప్రశంసించారు. చిరంజీవి ట్వీట్ కు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం విశేషం. తమని అప్రిషియేట్ చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు చెబుతూ జగన్ ట్వీట్ చేశారు.

'చిరంజీవి గారు.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మీ మంచి మాటలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ ఘనతకు కారణం గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశావర్కర్లు, మండల అధికారులు, జిల్లాస్థాయి అధికారులు, జాయిట్ కలెక్టర్లు, కలెక్టర్లు. క్రెడిట్ వారికే దక్కుతుంది. ఇది టీమ్ ఎఫర్ట్' అని జగన్ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి రిప్లై ఇచ్చారు.

చిరంజీవి, జగన్ మధ్య గత కొంత కాలంగా మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఆ మధ్యన చిరంజీవి దంపతులు జగన్ ఇంటికి వెళ్లారు. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ పై పొలిటికల్ గా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

More News

సీత పాత్ర కోసం ఫైర్ బ్రాండ్ లేడీని రికమండ్ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ ?

రాబోవు రోజుల్లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పురాణ గాధ నేపథ్యం ఉన్న చిత్రాలతో కళకళలాడబోతోంది. తెలుగు దర్శకుడు గుణశేఖర్ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభాస్ శ్రీ రాముడిగా ఆదిపురుష్ లో నటిస్తున్నాడు.

నాని వల్ల 5 సార్లు ఏడ్చా.. బాలీవుడ్ స్టార్ కామెంట్స్!

నేచురల్ స్టార్ నాని.. ఎమోషన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఎలాంటి వేరియేషన్ తో అయినా ప్రేక్షకులని కట్టి పడేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే నాని నటనకు అంతటి క్రేజ్ ఉంది

సెక్స్ కి కూడా వెనకాడరా.. ఎంత ఘోరం, ఫ్యామిలీ మ్యాన్ 2పై భగ్గుమంటూ..

ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో వివాదం ఇంకా రగులుతూనే ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే..

బికినీలో 'పెళ్లిసందడి' హీరోయిన్ ఎక్స్ పోజింగ్.. 53 ఏళ్ల వయసులో ఇలా..

స్వప్నసుందరి అంటూ 'పెళ్లి సందడి'లో సందడి చేసిన దీప్తి భట్నాగర్ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.

తన పెట్ తో ముంబయిలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన రష్మిక!

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది.