ఏపీలో కొత్త జిల్లాలు.. ఇకపై రాయలసీమకూ సముద్రతీరం, ఎలాగంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన కొనసాగించాలని సీఎం జగన్ పట్టుదలగా వున్నారు. అయితే జిల్లాల విభజన, వాటి పేర్లకు సంబంధించి అప్పుడే అభ్యంతరాలు మొదలయ్యాయి. అలాగే కొత్త జిల్లాల కారణంగా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సముద్ర తీరం కోస్తా జిల్లాలకు మాత్రమే వుండేది.. అయితే జిల్లాల పునర్విభజన కారణంగా రాయలసీమకూ తీర ప్రాంతం వచ్చింది. అదెలాగంటే..

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలను ఇప్పటి వరకు రాయలసీమగా పరిగణిస్తున్నారు. 26 జిల్లాల పునర్విభజనతో కోస్తా జిల్లాల సంఖ్య 12 కానుంది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీబాలాజీ జిల్లాతో కలపడంతో రాయలసీమకు తీరప్రాంతం వచ్చినట్లయింది. అలాగే రాయలసీమలో జిల్లాల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగింది. ఇప్పటికే వున్న కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలకు తోడుగా కొత్తగా నంద్యాల, శ్రీసత్యసాయి, శ్రీబాలాజీ, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటవుతున్నాయి.

అంతేకాదు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏజెన్సీ జిల్లాలంటూ ఏంలేవు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కొంత భాగాన్ని ఏజెన్సీ ప్రాంతాలుగానే పిలిచేవారు. జిల్లాల విభజన కారణంగా ఇప్పుడు పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి.

మరోవైపు ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయడంపై రాజంపేటవాసులు భగ్గుమంటున్నారు. దీనిలో భాగంగా గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజంపేట వైసీపీ మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 3వేల మంది విద్యార్థులు నిరసన నిర్వహించారు. ‘జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’ అంటూ ర్యాలీ చేపట్టారు.

More News

జగన్ పిలవగానే.. మోకాళ్లపై కూర్చొని మాట్లాడిన ఐఏఎస్ అధికారి, ఫోటో వైరల్

బ్యూరోక్రాట్లు ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద మితిమీరిన వినయం ప్రదర్శిస్తున్నారు.

రిపబ్లిక్ డే : వివాదంలో అనసూయ.. 'అరే ఏందిరా బై మీ లొల్లి..' అంటూ రెచ్చిపోయిన రంగమ్మత్త

స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు కారణం ఏంటీ..?

‘సుందరాంగుడు’ చిత్రం విడుదలకు సహకరించండి - హీరో కృష్ణసాయి

ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి,

‘‘ఫుల్ కిక్కు’’ అంటోన్న ఖిలాడీ.. రవితేజ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్‌గా నటిస్తోన్న సినిమా 'ఖిలాడి'.

‘‘విరాట్’’ సేవలకు ఇక విశ్రాంతి.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వీడ్కోలు

73వ గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు.