'మహానటి' లో కలెక్షన్ కింగ్..

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత కథను 'మహానటి' పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఎస్‌.వి.రంగారావు పాత్ర కోసం కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబును సంప్రదించారని సమాచారం.
నిజానికి ఈ పాత్రకు ముందుగా ప్రకాష్‌ రాజ్‌ పేరు వినపడినా దర్శక నిర్మాతలు మోహన్‌బాబు అయితే ఇంకా బావుంటుందని భావించారట. స్వర్గీయ ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన మనవడు, హీరో ఎన్టీర్‌, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అక్కినేని నాగచైతన్య నటించే అవకాశాలున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌, జర్నలిస్ట్‌ పాత్రలో సమంత నటిస్తున్నారు. సావిత్రి భర్త జెమిని గ‌ణేష‌న్ పాత్రలో మలయాళనటుడు దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నున్నాడు.

More News

ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ నటుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అల్రెడి విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్లుక్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'మా' టీమ్ ఆధ్వర్యంలో పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు

సీనియర్ రచయిత, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు `మా` టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

బాలయ్యతో మూడోసారి...

నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బాలయ్య 102వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

విజయ్ టైటిల్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తన 61వ సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ఇది వరకే థెరి అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి)దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా చేస్తున్నాడు.