'కలర్ ఫోటో' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్ ని కూడా అదే పంధాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

More News

అక్కడ అడుగు పెట్టిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్..

ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఆయన గుజరాత్ అసెంబ్లీలో

ఆ ప‌నిచేయ‌డానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా:  నందితా శ్వేత‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్ర‌ల‌తో

నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు.

ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది.