రెడీ అవుతున్న 'కొలంబస్'

  • IndiaGlitz, [Sunday,October 11 2015]

సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరింగ్ ల‌వ్' అనేది ఉపశీర్షిక. సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి ఇందులో కథానాయికలు. ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ..

నిర్మాత మాట్లాడుతూ ''ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరి. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్ మంచి నటన కనబర్చడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో న‌టించాడు. ఇష్క్ సినిమా ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌.సామ‌లను ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది.

ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వ‌ర‌లో పాట‌లను, వ‌చ్చే నెల 13న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి'' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర

More News

పాటల పల్లకీలో 'వందనం'

పెదబాబు,ఆర్య,అతడు,ఆంద్రుడు,లెజెండ్..ఇలా సుమారు 45 చిత్రాలలో బాలనటుడుగా ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నటుడు దీపక్ సరోజ్.ఈయువకుడు కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం'వందనం'.

అందుకే...'బ్రూస్ లీ' లో నాన్న గారితో సాంగ్ చేద్దామని శ్రీను వైట్ల అంటే... నేనే వద్దన్నాను : రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం బ్రూస్ లీ.ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కించారు.డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాని నిర్మించారు.

చిరు హ్యాట్రిక్ ఇస్తాడా?

కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో హ్యాట్రిక్ విజయాలున్నాయి.అయితే అతిథి పాత్రల పరంగా మాత్రం ఆ హ్యాట్రిక్ విజయాలు చిరుకి దక్కలేదని చెప్పుకోవచ్చు.

తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్

'ఊపిరి'..నాగార్జున,కార్తీ,తమన్నా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది.ఈ సినిమా తమిళంలోనూ 'తోళా' పేరుతో రూపొందుతోంది.

సమంతకి ఈసారి ఏం దక్కుతుందో?

క్యూట్ గర్ల్ సమంత,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు 'అత్తారింటికి దారేది',సన్నాఫ్ సత్యమూర్తి 'బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లు సంపాదించి..