close
Choose your channels

కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అంటూ నోరు పారేసుకున్న అలీ

Tuesday, October 22, 2019 • తెలుగు Comments

కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అంటూ నోరు పారేసుకున్న అలీ

తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ అలీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈయ‌న రీసెంట్‌గా న‌టించిన చిత్రం `రాజుగారిగ‌ది 3`. ఇందులో అలీది చాలా కీల‌క‌మైన పాత్రే. ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ ప్రెస్‌మీట్‌లో అలీ రివ్యూ రైట‌ర్స్‌పై నోరు పారేసుకున్నారు. కొంద‌రు కావాల‌నే నెగ‌టివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను భ్ర‌మ‌రాంబ‌లో సినిమా చూశాన‌ని, అక్క‌డే తాను సినిమా చూడాల‌నుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. ప్రేక్ష‌కులు డ‌బ్బులు పెట్టి సినిమా చూడ‌టానికి వ‌స్తారు కాబ‌ట్టే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, అదే ప్రివ్యూ షో చూస్తుంటే న‌వ్వు వ‌చ్చినా న‌వ్వ‌రు. ఇక‌పై నేను ప్రివ్యూ షోలు చూడ‌టం మానేస్తున్నా అన్ని అన్నారు అలీ.

సినీ క‌ళామ‌త‌ల్లి అంద‌రినీ ఒకేలా చూస్తుంద‌ని, కానీ కొంద‌రు కావాల‌ని సినిమా గురించి చెడుగా చెబుతున్నారు. అస‌లు సినిమా బాగోలేద‌ని చెప్ప‌డానికి మీరెవ‌రూ కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అని తీవ్రంగా మండిప‌డ్డాడు. కామెంట్ చేసే వారిని న‌మ్ముకుని మేం ఇండ‌స్ట్రీలోకి రాలేదు. ఒక సినిమా మీద రాయి వేసి మేం తోపుల‌మ‌ని అనుకుంటారు. కానీ అంత కంటే మూర్ఖులు ఎవ‌రూ ఉండ‌ని నేను అనుకుంటానంటూ సినీ విమ‌ర్శ‌కుల మీద అలీ నోరు పారేసుకున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz