కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అంటూ నోరు పారేసుకున్న అలీ

  • IndiaGlitz, [Tuesday,October 22 2019]

తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ అలీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈయ‌న రీసెంట్‌గా న‌టించిన చిత్రం 'రాజుగారిగ‌ది 3'. ఇందులో అలీది చాలా కీల‌క‌మైన పాత్రే. ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ ప్రెస్‌మీట్‌లో అలీ రివ్యూ రైట‌ర్స్‌పై నోరు పారేసుకున్నారు. కొంద‌రు కావాల‌నే నెగ‌టివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను భ్ర‌మ‌రాంబ‌లో సినిమా చూశాన‌ని, అక్క‌డే తాను సినిమా చూడాల‌నుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. ప్రేక్ష‌కులు డ‌బ్బులు పెట్టి సినిమా చూడ‌టానికి వ‌స్తారు కాబ‌ట్టే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, అదే ప్రివ్యూ షో చూస్తుంటే న‌వ్వు వ‌చ్చినా న‌వ్వ‌రు. ఇక‌పై నేను ప్రివ్యూ షోలు చూడ‌టం మానేస్తున్నా అన్ని అన్నారు అలీ.

సినీ క‌ళామ‌త‌ల్లి అంద‌రినీ ఒకేలా చూస్తుంద‌ని, కానీ కొంద‌రు కావాల‌ని సినిమా గురించి చెడుగా చెబుతున్నారు. అస‌లు సినిమా బాగోలేద‌ని చెప్ప‌డానికి మీరెవ‌రూ కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అని తీవ్రంగా మండిప‌డ్డాడు. కామెంట్ చేసే వారిని న‌మ్ముకుని మేం ఇండ‌స్ట్రీలోకి రాలేదు. ఒక సినిమా మీద రాయి వేసి మేం తోపుల‌మ‌ని అనుకుంటారు. కానీ అంత కంటే మూర్ఖులు ఎవ‌రూ ఉండ‌ని నేను అనుకుంటానంటూ సినీ విమ‌ర్శ‌కుల మీద అలీ నోరు పారేసుకున్నాడు.

More News

చిరంజీవి - కొరటాల చిత్రానికి బాలీవుడ్ టచ్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా మ‌రో ప‌క్క నిర్మాత‌గా కూడా బిజీ బిజీగా ఉన్నారు.

'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో డైరెక్టర్‌ కొండా విజయ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు తాజాగా యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం `RRR` .

హుజుర్‌నగర్‌లో భారీగా పోలింగ్.. గెలుపెవరిదో తేల్చిసిన సర్వే!

తెలంగాణలోని హుజుర్‌నగర్‌లో సోమవారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

బెల్లంకొండ గణేష్ స‌ర‌స‌న ఓ జోడిగా!

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో త‌న‌యుడు బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా రంగ ప్ర‌వేశం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.