close
Choose your channels

'ద‌బాంగ్ 3'లో అలీ

Saturday, April 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`ద‌బాంగ్ 3`లో అలీ

తెలుగులో స్టార్ కమెడియ‌న్ అలీ త్వర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ స్టార్ క‌మెడియ‌న్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అయితే ఆయ‌న రాజ‌కీయాలపైనే ఫోకస్డ్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. ఆ సినిమా ఏదో బాలీవుడ్ చిత్రం `ద‌బాంగ్ 3`.

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవా తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అలీ పోలీస్ కానిస్టేబుల్‌గా క‌నిపించ‌నున్నారు. స‌ల్మాన్‌ఖాన్‌ను అలీ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓ ఫోటో దిగారు. ఈ అవ‌కాశం అలీకి మ‌రెన్ని బాలీవుడ్ అవ‌కాశాల‌ను తేనుందో చూడాలి. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. `వాంటెడ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌భుదేవా, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సూప‌ర్ హిట్ సిరీస్ కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.