Pawan kalyan - ali : పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సంచలన ప్రకటన

  • IndiaGlitz, [Wednesday,January 18 2023]

మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కమెడియన్ అలీ అత్యంత సన్నిహితుడు. పవన్ సినిమా చేస్తుంటే.. అందులో అలీకి ఖచ్చితంగా ప్లేస్ ఉండాల్సిందే. దీనిని ఓ సెంటిమెంట్‌గా పెట్టుకున్నారు పవన్. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. పవన్‌ బద్ధ శత్రువుగా భావిస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌తో అలీ క్లోజ్‌గా వుండటం జనసేనానికి నచ్చడం లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అలీ పలుమార్లు దీనిపై స్పందించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అదంతా మీడియా సృష్టించినదేనని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ సహజమే :

తాజాగా చిత్తూరు జిల్లా నగరి కొండుచుట్టు ఉత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే పవన్‌పై నిలబెడతానని.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని అలీ జోస్యం చెప్పారు. ఇక రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శలు చేయడం సహజమన్న ఆయన.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, ఫ్రెండ్‌షిప్ వేరని అన్నారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి :

కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా ముద్రపడిన అలీ.. 2019 ఎన్నికలకు ముందుకు వైసీపీలో చేరారు. ఆ సమయంలో గుంటూరు వెస్ట్ కానీ, రాష్ట్రంలోని మరేదైనా నియోజకవర్గ టికెట్ లభిస్తుందని అలీ ఆశించారు. కానీ జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో.. వైసీపీ అభ్యర్ధుల తరపున ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా అలీకి ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో మూడేళ్ల పాటు ఆయన వెయిట్ చేశారు. అలీకి పదవి దక్కకపోవడానికి అనేక కారణాలు వున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అలీ అత్యంత ఆప్తుడు, అలాగే తెలుగుదేశం పార్టీలోని నేతలందరితోనూ ఆయనకు సత్సంబంధాలు వున్నాయి. ఈ కారణం చేతే జగన్ దృష్టి అలీ మీదకు వెళ్లలేదని విశ్లేషకులు అంటున్నారు.

గుడ్ న్యూస్ చెబుతానని.. మొండిచేయి :

ఇక తన పని తాను చేసుకుంటూ పోతున్న సమయంలో ఈ ఏడాది ఆరంభంలో సీఎం జగన్‌ను అలీ కలిశారు. త్వరలో శుభవార్త వింటారని, సిద్ధంగా వుండాలని జగన్ అన్నారు. దీంతో అంతా అలీకి రాజ్యసభ ఖాయమని భావించారు. కానీ అక్కడా ఈ సొట్టబుగ్గల చిన్నోడికి నిరాశ తప్పలేదు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌లో అలీ పేరు వినిపించలేదు. కానీ ఆయన ఎలాంటి స్పందనా చేయలేదు. అయితే మరోసారి వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా .. దానిని ఖాదర్ భాషాకు ఇచ్చారు. అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయగా, పార్టీ పదవులు కూడా ఫుల్ అయ్యాయి. ఈ క్రమంలో అలీకి ఈసారి మొండిచేయి తప్పదని అంతా భావిస్తున్న వేళ .. జగన్ అనూహ్యంగా ఆయనను ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవిలో నియమించారు.

More News

Panja Vaishnav Tej :పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రచార చిత్రం విడుదల

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో

Shaakuntalam:ఫిబ్ర‌వ‌రి 17న ‘శాకుంతలం’ రిలీజ్‌

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న

చంద్రబాబు సభలో తొక్కిసలాట .. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం : మన్నవ మోహనకృష్ణ

న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో జరిగిన చంద్రన్న కానుక, ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో

Sir: ధనుష్ 'సార్' నుంచి ‘బంజారా‘ గీతం విడుదల

శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ.

Pawan Kalyan : కదనరంగంలోకి వారాహి... అంజన్న ఆశీస్సుల కోసం కొండగట్టుకి పవన్ కల్యాణ్

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.