నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

  • IndiaGlitz, [Friday,April 10 2020]

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అసలేం జరిగింది!?

కాగా.. గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు ఇంట్లో స్టెప్స్ పైనుంచి కింద పడ్డాడని తెలుస్తోంది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో అప్రమత్తమైన కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తల భాగంలో తీవ్ర గాయం కావడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని నర్సింగ్ కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న సినీ ప్రముఖులు, ఆప్తులు, పలువురు నటులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని ధైర్యం చెప్పారని తెలుస్తోంది.

కాగా.. నర్సింగ్ యాదవ్ 25 ఏళ్లుగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా తనదైన ముద్రవేసుకున్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రమైన ‘క్షణం క్షణం’ నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.

More News

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఏపీలో పరీక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని

‘రేపట్నుంచి తెలంగాణలో కరోనా కేసులుండవేమో!’

రేపట్నుంచి అనగా శుక్రవారం నుంచి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఉండకపోవచ్చేమోనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

విపత్కర తరుణంలో రాజకీయాలొద్దు..: జనసేనాని

కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయిందని.. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను

హైదరాబాదీలను బెంబేలెత్తిస్తున్న కరోనా హాట్ స్పాట్స్..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో..! ఆ ఘటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.

మరోసారి లారెన్స్ దాతృత్వం.. 3 కోట్లు విరాళం

ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మంచి మనసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎంతో మందిని అనాధ పిల్లలు, దివ్యాంగాలను అక్కున చేర్చుకుని వారిని పోషిస్తున్నాడు.