కమెడియన్ పృధ్వీరాజ్‌కు తీవ్ర అనారోగ్యం.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు..

ప్రముఖ హాస్య నటుడు పృధ్వీరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలతో ఆయన బాధపడుతున్నప్పటికీ పరీక్షల్లో మాత్రం నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. అయితే తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యులు ఆయనను ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలని సూచించారు. దీంతో ప్రస్తుతం సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

‘‘పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. అన్ని టెస్టులూ చేయించాను. కొన్ని చోట్ల కోవిడ్ నెగిటివ్ వచ్చింది. మళ్లీ సీటీ స్కాన్ చేయించగా.. పరీక్షించిన వైద్యులు కొన్నిసార్లు నెగిటివ్ రావొచ్చని.. క్వారంటైన్‌లో జాయిన్ అవ్వాలని సూచించారు. నిన్న అర్ధరాత్రి జాయిన్ అయ్యాను. అంతా బాగానే ఉంది. మీ అందరి ఆశీస్సులు.. ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాకుండాలని కోరుకుంటున్నా’’ అని పృధ్వీరాజ్ తెలిపారు.

More News

నిన్న సీఎంకు.. నేడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్..

నిన్న కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. నేడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకు కరోనా సోకింది.

వరుసగా ఆరో రోజు 50 వేలు దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కరోనా కేసులు దేశంలో 50 వేలకు ఏమాత్రం తగ్గడం లేదు.

తెలంగాణలో తాజాగా 1286 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు.

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..

ప్ర‌ముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77)  మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.