'ఇంద్ర', 'అజ్ఞాతవాసి'.. కొన్ని కామన్ పాయింట్స్

  • IndiaGlitz, [Tuesday,January 02 2018]

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే సరదాగా, గమ్మత్తుగా ఉంటాయి. ఒకవేళ ఆ విషయాలు సినిమాలకు సంబంధించిన‌వైతే.. అవి ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలాంటి ఓ యాదృచ్ఛిక‌ విషయం మెగా సోదరుల మధ్య జరిగితే ఇంకెంత ఆసక్తి ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విషయమే వారి సినిమాల్లో జరిగింది. అవే చిరంజీవి నటించిన చూడాలని ఉంది', పవన్ కల్యాణ్ నటించిన ఖుషి' సినిమాలు. నిశితంగా పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు కూడా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కినవే. రెండూ సూపర్ హిట్ మూవీలే. మళ్ళీ ఇలాంటి విషయాలే పవన్ నటించిన అజ్ఞాతవాసి' విష‌యంలో పునరావృతం కానున్నాయి.

16 ఏళ్ల క్రితం చిరు నటించిన ఇంద్ర', ఇప్పుడు పవన్ నటించిన అజ్ఞాతవాసి'.. రెండూ కూడా వారణాసి నేపథ్యంలో రూపుదిద్దుకున్నాయి. ఇంద్ర' వైజయంతి మూవీస్ సంస్థ‌కి సిల్వర్ జూబిలీ ఇయ‌ర్‌ ఫిలిం.. బి.గోపాల్, చిరంజీవి కాంబినేషన్లో 3వ సినిమా. అలాగే అజ్ఞాతవాసి' పవన్ కి సిల్వర్ జూబిలీ సినిమా కాగా.. అలాగే త్రివిక్రమ్, పవన్ కలయికలో 3వ చిత్రం. ఈ రెండు సినిమాలలో కూడా ఇద్దరు కథానాయికలు...అలాగే ఆయా హీరోలతో మొదటి సారిగా నటించారు. ఇక‌ ఈ రెండు చిత్రాలకి ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వర రావు పనిచేసారు. ఇంద్ర'లో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అతిథి పాత్రలో మెరవగా.. విక్టరీ వెంకటేష్ అజ్ఞాతవాసి'లో అతిథి పాత్రతో సంద‌డి చేయ‌నున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే...అజ్ఞాతవాసి' సినిమాకి వాడిన ట్యాగ్ లైన్ ప్రిన్స్ ఇన్ ఎక్సైల్' ఈ రెండు సినిమాలకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. రెండు సినిమాల్లోనూ హీరో అజ్ఞాతంలో ఉండే వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇన్ని అంశాలు కలగలసిన ఈ రెండు సినిమాల్లో ఇంద్ర' చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ గా, ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిపోయింది. మరి అజ్ఞాతవాసి' పవన్‌కి ఏ రేంజ్ లో ప్లస్ అవుతుందో వేచి చూడాలి.

More News

మ‌ళ్ళీ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రాజ్‌ తరుణ్‌ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది

2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.

రచయిత రామస్వామి దర్శకత్వంలో 'మూడు పువ్వులు ఆరు కాయలు'!

`ప్రేమ గొప్పదే.. జీవిత లక్ష్యం ఇంకా గొప్పది.ప్రేమంటే చంపటమో చావటమో కాదు,చచ్చేదాకా కలిసి బ్రతకటం.

మర్ల పులి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి

వరుణ్ సందేశ్ ప్రత్యక పాత్రలో అర్చన వేద ,పోసాని కృష్ణ మురళి ,ముఖ్య పాత్రలో సుధాకర్ IMPECS INDIA PVT LTD పతాకం పై భవాని శంకర్ బి.సుధాకర్ రెడ్డి ఐ యస్.దినకర్ రెడ్డి సంయుక్తంగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మర్లపులి.ఇటీవలే సైరా నరసింహరెడ్డి సంస్థా కార్యాలయంలో చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు.

వైఎస్సార్ గా మమ్ముట్టి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది.