close
Choose your channels

పవన్‌వి తేడా జీన్స్.. చిరు మంచి పనిచేశారు!

Monday, April 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్‌వి తేడా జీన్స్.. చిరు మంచి పనిచేశారు!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముందు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఫలితాలు వచ్చిన తర్వాత గుడ్ బై చెప్పేసిన బండ్ల గణేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు..? తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? పవన్, చిరంజీవి గురించి ఇలా పలు విషయాలపై బండ్ల మాట్లాడారు.

ఆయన ప్రధాని.. ఈయన సీఎం!

ఇంటర్వ్యూలో భాగంగా జనసేన అధినేత పవన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. ఈ విషయంపై గణేశ్ ఏం మాట్లాడారో మీరే చూడండి. "రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదా చూడాలనే నా కోరిక. (అసలు ఈ రెండు జరిగేవేనా అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగ్గా..) ఎందుకు జరుగకూడదు? పవన్ కళ్యాణ్ సీఎం కాకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ ఏమైనా జరుగవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని కాలేదా?" అని బండ్ల గణేశ్ తిరిగి ఇంటర్వ్యూ చేసే వ్యక్తినే ప్రశ్నించారు.

చిరు మంచి పనిచేశారు..!

"చిరంజీవి పార్టీని విలీనం చేసినపుడు ఇలా చేస్తున్నారేంటి అనిపించింది. కానీ ఇపుడు ఆయన అలా ఎందుకు చేశాడో అర్థమైంది. ఆయన కొందరి వాడిలా కాకుండా అందరి వాడిలా ఉండాలనే ఆ మంచి పని చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే అలా చేశారు" అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ తేడా జీన్స్

"చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం.. నేను రాజకీయాలు మానేశానని ఆయనతో నన్ను కంపేర్ చేయవద్దు. ఆయన ఒక లెజెండ్. ఆయన రాజకీయాలకు దూరం కావడం 200 శాతం కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాజకీయాల నుంచి తప్పుకోవాలనే సలహా ఇవ్వలేను. ఆయన వ్యక్తిత్వం వేరు. ఆయనవి తేడా జీన్స్.. వేరే రేంజిలో ఉంటారు.. కాబట్టి రాజకీయాలకు ఆయన సమర్దుడు" అని బండ్ల గణేష్ తన మనసులోని మాటను తెలిపారు. కాగా బండ్ల ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లంతా నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.