కరోనా టెస్టుల్లో గందరగోళం.. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అంటూ కాల్స్..

  • IndiaGlitz, [Saturday,June 27 2020]

తెలంగాణ ప్రభుత్వం చాలా తక్కువ స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. అయితే కేసుల సంఖ్య మాత్రం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు 2200 రూపాయలకే టెస్టులు నిర్వహిస్తామని భారీగా ప్రచారం నిర్వహించాయి. దీంతో పెద్ద సంఖ్యలో కరోనా లక్షణాలున్నవారు పరీక్షల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

టెస్టుల కోసం వచ్చిన వారి పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్ వివరాలను తప్పుగా నమోదు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టెస్టులు చేయించుకున్న వారి ఫలితాన్ని తెలియజేయడంలో సైతం గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. నెగిటివ్ వచ్చిన వారిని సైతం పాజిటివ్ వచ్చినట్టు కాల్స్ వెళుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకుగురవుతున్నారు.