close
Choose your channels

కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమిదేనా!

Wednesday, October 16, 2019 • తెలుగు Comments

కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమిదేనా!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. కేసీఆర్ ఫాంహౌస్‌లో వెంకటేశ్వర్లు అనే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తుండేవారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ బుధవారం నాడు తన దగ్గరున్న ఏకే 47 గన్‌తో కాల్చుకొని ప్రాణాలు వదిలాడు. ఈయన 12వ బెటాలియన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. నల్గొండ జిల్లా వాసి అయిన వెంకటేశ్వర్లు.. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న సమయంలో మద్యంమత్తులో ఉన్నాడని తెలిపారు. గతకొంతకాలంగా అతను విధులకు సరిగా హాజరు కావడం లేదని సీపీ తెలిపారు. అయితే.. భార్య విజ్ఞప్తితో తిరిగి విధుల్లో వెంకటేశ్వర్లను చేర్పించుకున్నామని.. ఆయన మీడియాకు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz